
ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ
॥పల్లవి॥ ఎక్కడి దురవస్థ లేఁటిదేహము లోనఁ జిక్కి జీవుఁడు మోక్షసిరిఁ జెందలేఁడు ॥చ1॥ ఒడలు మంసపూర మొక పూఁటయిన మీఁదు గడుగకున్నఁ గొరగాదు కడలేనిమలమూత్రగర్హిత మిది, లోను గడుగరాదు యెంతగడిగినఁ బోదు ॥చ2॥ అలర చిత్తము చూడ నతిచంచలము దీనఁ గలసిన పెనుగాలి గనము మెలుపులేనిచిచ్చు మీఁదమిక్కిలిఁ గొంత నిలుపు లేదు పట్టి నిలుపఁగరాదు ॥చ3॥ తిరువేంకటాచలాధిపుఁడు నిత్యానంద- కరుఁడు జీవునకు రక్షకుఁడు కరుణించి యొకవేళఁ గాచినఁగాని మేను- చొరకమానెడుబుద్ది చోఁక దెవ్వరికి |
రాగము: లలిత రేకు: 0017-06 సంపుటము: 1-106 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత