
ఎక్కడనున్నా నీతఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎక్కడనున్నా నీతఁడు దిక్కయి మాదెసఁ దిరిగీఁగాక ॥చ1॥ సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడు పరమాత్మ డఖిల బంధువుఁడు హరి లోకోత్తరుఁ డతఁడే నామతి సిరితోఁ బాయక చెలఁగీఁగాక ॥చ2॥ ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడు పన్నగశయనుఁడు భవహరుఁడు యిన్నిటఁగ లిగిన యిందిరారమణుఁడు మన్ననతో మము మనిపీఁగాక ॥చ3॥ మమతల నలమేల్మంగకు సంతత – రమణుఁడు వేంకటరాయఁడు జమళిసంపదల సరసవిభవముల తమకంబున మముఁదనిపీఁగాక |
రాగము: ముఖారి రేకు: 0068-03 సంపుటము: 1-354 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి