
ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎంత భక్తవత్సలుఁడ విట్టుండవలదా వింతలు నీసుద్దులెల్లా వినఁబోతే నిట్టివే ॥చ1॥ యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు బలివిభీషణాదులపాలికే చెల్లదు కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా తలచి చూడ నీదాసుల కోడుదువు ॥చ2॥ యిందరిపాలిటికిని యీశ్వరుఁడ వేలికవు పందవై యర్జునుబండిబంట వైతివి వందనకు నౌలే దేవతలకే దొరవు అందపునీదాసులకు నన్నిటా దాసుఁడవు ॥చ3॥ కడుపులో లోకముకన్న తండ్రి విన్నిటాను కొడుకవు దేవకికిఁ గోరినంతనే తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు విదువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి |
రాగము: శంకరాభరణం రేకు: 0095-03 సంపుటము: 1-473 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం