
ఎంత బోధించి యేమి సేసినఁ దన- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎంత బోధించి యేమి సేసినఁ దన- దొంతికర్మములు తొలఁగీనా ॥చ1॥ సతతదురాచారజడునకుఁ బుణ్యసం గతి దలపోసినఁ గలిగీనా అతిపాపకర్మబోధకుఁడై వెలయుదుష్ణు మతిఁ దలపోసిన మరి కలిగీనా ॥చ2॥ బహుజీవహింసాపరుఁడైనవానికి యిహపరములు దైవ మిచ్చీనా విహితకర్మములువిడిచినవానికి సహజాచారము జరిగీనా ॥చ3॥ దేవదూషకుఁడై తిరిగేటివానికి దేవతాంతరము దెలిసీనా శ్రీవేంకటేశ్వరుఁ జింతిపకుండిన పాపనమతుఁడై బ్రతికీనా |
రాగము: నాట రేకు: 0067-02 సంపుటము: 1-347 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట