ఎంతటివారలు నెవ్వరును హరిఁ
॥పల్లవి॥ ఎంతటివారలు నెవ్వరును హరిఁ జింతిచక నిశ్చింతులు గారు ॥చ1॥ అతిజితేంద్రియులు ననశనవ్రతులు- నతుల తపోధనులగువారు చతురానన గురుస్మరణము దొరకక తతి నూరక పుణ్యతములుగారు ॥చ2॥ అనఘులు శాంతులు నధ్యాత్మతతులు- ననుపమ పుణ్యులు యాజకులు వనజోదరు ననవరతముఁ దలఁచక వినుతి స్మృతికిని విభుదులుగారు ॥చ3॥ దురిత విదూరులు దుర్మతిహీనులు నిరతానందులు నిత్యులును తిరువేంకటగిరిదేవుని గొలువక పరమార్గమునకు బ్రహ్మలు గారు | రాగము: గుండక్రియ రేకు: 0005-03 సంపుటము: 1-32 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియ