
ఎండలోనినీడ యీమనసు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఎండలోనినీడ యీమనసు పండు గాయసేయఁబనిలేదు మనసు ॥చ1॥ వానచేతకములవలెనాయ మనసు గోనెఁబట్టినబంకగుణమాయ మనసు మానఁజిక్కినకోలమతమాయ మనసు తేనెలోపలియీఁగ తెఱఁగాయ మనసు ॥చ2॥ గడిరాజుబదుకాయ కడలేని మనసు నడివీది పెసరాయ నయమైన మనసు గడకుఁగట్టినపాఁతగతి దోఁచె మనసు అడుసులోపలికంబమై తోఁచె మనసు ॥చ3॥ తెరవుచూపినజాడఁ దిరుగు నీమనసు మరుగఁజేసినచోట మరుగు నీ మనసు తిరువేంకటేశుపైఁ దిరమైన మనసు సిరిగలిగినచోటఁ జేరు నీమనసు |
రాగము: ఆహిరి రేకు: 0065-04 సంపుటము: 1-337 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి