శుక్రవారం , 27 డిసెంబర్ 2024

దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్

కడప : వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు గురువారం ఫోన్ చేశారు.

పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్  నుంచి గండికోట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు.

గురువారం పులివెందులలోని ఇంట్లో నుంచి వైఎస్ జగన్‌రెడ్డి సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అనంతపురం, వైఎస్‌ఆర్‌జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయానికి సంబంధించి వివరాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.

చదవండి :  'ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు'

  ఆయకట్టుకు 1.2టీఎంసీలు.. తాగునీటి అవసరాలకు 2టీఎంసీల చొప్పున కేటాయించారని.. అవి కూడా సక్రమంగా రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింహాద్రిపురం, లింగాల మండలాల్లో చీనీ, అరటి రైతులు వేలాది ఎకరాల్లో చెట్లను నరికివేశారని.. ఈ సారి కూడా ఆయకట్టుకు రాకపోతే చెట్లను మరిన్ని వందల ఎకరాల్లో కొట్టేసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పీబీసీకి అదనంగా ఒక టీఎంసీ నీరు ఇవ్వడంతోపాటు పోతిరెడ్డిపాడు, గండికోట వరద కాలువకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

చదవండి :  పోతిరెడ్డి పాడు వివాదం నేర్పుతున్న పాఠం

ఈ ఏడాది వరద నీరు సక్రమంగా నిలబెట్టుకోలేక వందల టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయని.. పోతిరెడ్డిపాడు – గండికోట మధ్య కాలువ పనులు పూర్తి చేయడం ద్వారా కనీసం 25టీఎంసీలనుంచి 30టీంఎసీల నీటిని నిలబెట్టుకోవచ్చునన్నారు. తద్వారా నీరు గండికోటకు తీసుకరావచ్చునని.. దీంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలకు నీరు అందుతుందని తెలియజేశారు. అలాగే ముంపు గ్రామాలకు సంబంధించి పరిహార సమస్యలు తీర్చాల్సి ఉందని.. వెంటనే ఆ దిశగా కూడా చర్యలు చేపట్టాలని జగన్ కోరినట్లు అవినాష్ వెల్లడించారు.

చదవండి :  పట్టిసీమ మనకోసమేనా? : 2

ఇదీ చదవండి!

అఖిలపక్ష సమావేశం

‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: