సోమవారం , 23 డిసెంబర్ 2024

ఉపాధి కల్పన మిషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఉపాధి కల్పన మిషన్ ఆధ్వర్యంలో గ్రామీణ యువతీ యువకులకు Spoken English, Writing, Computer Operating అంశాల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఔత్సాహిక యువత ముందుకు రావాలని సంస్థ పథక సంచాలకుడు వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

జనవరి 18 నుంచి 20వ తేదీ వరకూ నగరశివారు టీటీడీసీలో ముఖాముఖికి హాజరు కావాలని సూచించారు.

ఎంపికైన అభ్యర్థులకు అక్కడే శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని వివరించారు. వసతి, భోజన సదుపాయం కల్పిస్తామనీ వెల్లడించారు. శిక్షణ సమయం పూర్తికాలం అక్కడే బస చేయాలన్నారు.

చదవండి :  దాల్మియా గనుల తవ్వకాల నిలుపుదల

అనంతరం.. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లోని ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ అవకాశాన్ని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: