ఈ రోజు నుండి కడపలో ఆంధ్ర – కేరళ రంజీ మ్యాచ్

కేరళ తరపున బరిలోకి శ్రీశాంత్

క్రికెట్ ప్రేమికులను అలరించే రంజీ పండుగ శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ రంజీ మ్యాచ్‌ను జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారు. కాగా గురువారమే నగరానికి చేరుకున్న ఆంధ్రా, కేరళ జట్ల క్రీడాకారులు శుక్రవారం ముమ్మరంగా సాధన చేశారు. స్టార్ ఆటగాడు శ్రీశాంత్ కోసం అభిమానులు శుక్రవారంమే క్రీడామైదానానికి చేరుకోవడం విశేషం. దేశవాలీ రంజీ మ్యాచ్‌లలో రాణిస్తూ మంచిఫాంలో ఉన్న ఆంధ్రాజట్టు ఈ మ్యాచ్‌లో ఆధిక్యం సాధించినా, గెలుపొంది నా మొదటిస్థానం పొందే అవకాశం ఉంది.

చదవండి :  విజయమ్మకు 81వేల 373 ఓట్ల మెజార్టీ

కడపకు చేరుకున్న శ్రీశాంత్

srisanthప్రపంచ కప్ సాధించిన భారత జట్టు సభ్యుడు శ్రీశాంత్ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. శివసాయి రెసిడెన్సీలో భోజనం చేసి బస చేశారు. శ్రీశాంత్ ఆటోగ్రాఫ్‌కోసం అభిమానులు ఆరాట పడ్డారు. అచ్చ తెలుగులో బాగున్నారా అంటూ పలకరించారు.

ఆంధ్రాజట్టు

ఏ.జి. ప్రదీప్ (కెప్టెన్), బి. సుమంత్ (వైస్ కెప్టెన్), డి.బి. ప్రశాంత్‌కుమార్, కె.ఎస్.భరత్ (వికెట్‌కీపర్), కె.ఎస్. షాబుద్దీన్, అముల్ ముజుందార్, కె. భరత్‌రెడ్డి, రాజేష్‌పవార్, పి. విజయ్‌కుమార్, జి. చిరంజీవి, ఎం.యు.బి. శ్రీరాం, టి. అచ్యుతరావు, ఎస్.కె.ఎం. బాషా, డి. సుధాకర్, ఎం. అజయ్‌కుమార్
జట్టు మేనేజర్ : జి.జె.జె.రాజు,
కోచ్ : కౌశిక్ పటేల్

చదవండి :  కడపలో కాదు.. కమలాపురంలో తేల్చుకుందాం

కేరళజట్టు

రోహన్‌ప్రేమ్ (కెప్టెన్), సచిన్‌బేబి, వి.ఎ.జగదీష్, అభిషేక్ ఎం.హెడ్గే, రాబర్ట్ ఫెర్నాండజ్, సంజిత్ విశ్వనాథ్ (వికెట్ కీపర్), అక్షయ్‌కోడోత్ (వికెట్‌కీపర్), కె.జె. రాకేష్, ఎస్. శ్రీశాంత్, సందీప్ వారియర్, మనుకృష్ణన్, సి.పి. షాహిద్, కె.ఆర్. శ్రీజిత్, పి. ప్రశాంత్‌పరమేశ్వర్, అంతాఫ్ కోచ్ : సుజిత్ సోమసుందర్

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: