
ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయ తెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు ॥చ1॥ అనిశమును దేహమును కన్న పానము లిడిన యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో గొనకొన్న మానినుల కూటముల సుఖము లివి మనసుదాటినపాలు మట్టులేదెపుడు ॥చ2॥ వొడలఁబెట్టినసొమ్ము లొగిఁ దనకుఁ గానరా- వడవిఁ గాసినవెన్నె లది కన్నులకును వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే బెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట ॥చ3॥ చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు యెద్దుయెనుపోతునై యేకంబు గాదు వొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలో అద్దంపునీడవలె నాత్మ బొడచూపె |
రాగము: బౌళి రేకు: 0097-04 సంపుటము: 1-486 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి