
ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇదియే మర్మము హరి యిందుఁగాని లోనుగాడు పదపడి జీవులాల బదుకరో ॥చ1॥ హరి గానలేరు మీరు అరసెందువెదకినా హరిదాసు లెఱుఁగుదు రడుగరో గరిమెఁ బ్రత్యక్షము గాఁడు దేవుఁ డెవ్వరికి ధరఁ బ్రత్యక్షము హరిదాసుల గొలువరో ॥చ2॥ చేత ముట్టి గోవిందుని శిరసు వూజించలేరు చేతులార ప్రపన్నులసేవ సేయరో జాతిగాఁగ విష్ణునిప్రసాద మేడ దొరకీని ఆతల వారి బ్రసాద మడుగరో ॥చ3॥ అంతరంగమున నున్నాఁడందురు విష్ణుడు గాని అంతటా నున్నారు వైష్ణువాధికులు చెంతల దదియ్యుల చేతియనుజ్ఞ వడసి సంతతం శ్రీవేంకటేశు శరణము చొరరో |
రాగము: సాళంగనాట రేకు: 0086-02 సంపుటము: 1-418 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట