ఇతరము లిన్నియు నేమిటికి
॥పల్లవి॥ ఇతరము లిన్నియు నేమిటికి మతిచంచలమే మానుట పరము ॥చ1॥ ఎక్కడిసురపుర మెక్కడివైభవ- మెక్కడి విన్నియు నేమిటికి యిక్కడనే పరహితమునుఁ బుణ్యము గక్కునఁ జేయఁగఁ గల దిహపరము ॥చ2॥ యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు- లెవ్వరిందరును నేమిటికి రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు యివ్వలఁ దాఁ సుఖియించుట పరము ॥చ3॥ యెందరు దైవము లెందరు వేల్పులు యెంద రిందురును నేమిటికి కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని చిందులేక కొలిచిన దిహపరము | రాగము: సామంతం రేకు: 0014-04 సంపుటము: 1-86 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం