
ఇటువలెనేపో సకలము యించుకగన భావించిన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఇటువలెనేపో సకలము యించుకగన భావించిన అటమటములసంతోషము ఆసలు సేయుటలు read ॥చ1॥ పగగొనితిరిగేటిజన్మపుబాధలు తనకే కాలము తగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాక పొగలోపల సేక గాసిన భగభగఁ గన్నుల నీళ్లు నిడిగినదు: ఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా ॥చ2॥ పొలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చిక మాటలు తలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాక బలువునఁ బారఁగ మోహవుపాశము తన మెడఁ దగిలిన తలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ॥చ3॥ చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల- చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా ఆతుమఁగల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపక యేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకౌనా |
రాగము: బౌళి రేకు: 0050-03 సంపుటము: 1-306 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి