అన్నియును నతని కృత్యములే
॥పల్లవి॥ అన్నియును నతని కృత్యములే యెన్నియైనానవు నతఁడేమి సేసినను lisinopril and driving lisinopriland.net lisinopril and driving arcoxia arcoxia tablete cijena ॥చ1॥ అణురేణు పరిపూర్ణుఁడవలి మోమైతేను అణువౌను కమలభవాండమైన ఫణిశయనుని కృపాపరిపూర్ణ మైతే తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే ॥చ2॥ పురుషోత్తముని భక్తి పొరపొచ్చ మైతే ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను హరిమీఁది చింత పాయక నిజం బైతే నిరతిఁ బట్టినవెల్లా నిధానములే ॥చ3॥ మదనగురుని సేవ మదికి వెగటైతేను పదివేలు పుణ్యములు పాపంబులే పదిలమై వేంకటపతి భక్తి గలిగితేను తుదిపదంబునకెల్ల దొడవవు నపుడే |
రాగము: శ్రీరాగం రేకు: 0003-07 సంపుటము: 1-20 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం