అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

అన్నమయ్య ఊరేగింపు

అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

సంకీర్తనాచార్యులు అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు గురువారం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామం (రాజంపేట మండలం)లో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య ధ్యానమందిరంలో గోష్టి గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో వూరేగించారు. అంతకు ముందు అన్నమయ్య మూలవిరాట్ వద్ద గ్రామపెద్దలు, తితిదే అధికారులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

చివరగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికారులు, తాళ్ళపాక గ్రామస్తులు పాల్గొన్నారు.

చదవండి :  జనులు నమరులును జయలిడఁగా - అన్నమయ్య సంకీర్తన

అన్నమయ్య వర్థంతి  ఉత్సవాలు ఈనెల 31వరకు అటు తాళ్లపాకలో, ఇటు అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద నిర్వహించనున్నారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: