
అతనికెట్ల సతమైతినో కడు- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అతనికెట్ల సతమైతినో కడు- హితవో పొందులహితవో యెఱఁగ ॥చ1॥ హృదయము తలఁపున నిరవయినఁగదా పదిలమౌను లోపలిమాట వెదకినచిత్తము వెర వెఱఁగదు నే – నెదిరి నెఱఁగ నే నేమియు నెఱఁగ ॥చ2॥ కాలూఁద మనసు గలిగికదా నా- తాలిమి మతిలోఁ దగులౌట మేలిమిపతిలో మెలఁగుటేదో నే – నేలో నే నిపుడెక్కడో యెఱఁగ ॥చ3॥ నేఁడని రేపని నే నెఱిఁగికదా పోఁడిమి మతిలో పొలుపౌట వాఁడే వేంకటేశ్వరుఁడు రాఁగలిగె ఆఁడుజన్మమేనౌటిది యెఱుఁగ |
రాగము: సామంతం రేకు: 0070-06 సంపుటము: 1-369 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం