
అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము మట్టుపడితే శాంతము మఱి యేలా ॥చ1॥ జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములు వొడలిలో జీవునికి నొక్కొక్కవేళ బడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపము వుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా ॥చ2॥ ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారము వూరక కలిమిలేము లొక్కొక్కవేళ మేరలేని చీకటియై మించును దుఃఖములెల్లా వూరట లేనికర్మికి నొక్కొక్కవేళా ॥చ3॥ పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచు వొనర నజ్ఞానికి నొక్కొక్కవేళ యెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకా వునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా |
రాగము: సాళంగనాట రేకు: 0098-01 సంపుటము: 1-489 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగనాట