అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి
॥పల్లవి॥ అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి కుక్కనోరికళాసమై కొల్లఁబోయ బతుకు ॥చ1॥ ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్లానే బండుబండై యెందుఁ గడపల గానక వుండగిలి నరకాల నుడుకబోయెద మింక వండఁ దరిగినకూరవలెనాయ బతుకు ॥చ2॥ పంచమహపాతకాలబారిఁ బడి భవములఁ దెంచి తెంచి ముడివేయ దీదీపులై పొంచినయాసలవెంటఁ బొరలఁబోయెద మింక దంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు ॥చ3॥ యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని- బాదచేత మేలెల్ల బట్టబయలై గాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింక బీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు |
రాగము: ఆహిరి రేకు: 0015-02 సంపుటము: 1-90 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి