అందరి కాధారమైన‌ఆదిపురుషుఁ డీతఁడు – అన్నమయ్య సంకీర్తన

అందరి కాధారమైన‌ఆదిపురుషుఁ డీతఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
అందరి కాధారమైన‌ఆదిపురుషుఁ డీతఁడు
విందై మున్నారగించె విదురునికడ నీతఁడు
॥చ1॥
సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు
వనజ భవాదులకును దైవంబైనతఁ డీతఁడు
యినమండలమునఁ జెలఁగేటిహితవైభవుఁ డీతఁడు
మునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు
॥చ2॥
సిరులొసఁగి యశోదయింట శిశువైనతఁ డీతఁడు
ధరనావులమందలలో తగఁ జరించె నీతఁడు
సరసతలను గొల్లెతలకుఁ జనవులొసఁగె నీతఁడు
ఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు
॥చ3॥
పంకజభవునకును బ్రహ్మపద మొసఁగెను యీతఁడు
సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు
తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు
వేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు
రాగము: సామంతం
రేకు: 0067-06
సంపుటము: 1-351

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగాని - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: