‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

వదినకు ఒకసరి
బిందెకు బిగసరి
బంగారు జడ కుచ్చుల మా వదిన
అహ బంగారు జడ కుచ్చుల మావదిన
।వదినకు ।

తాటి తోపులో
పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన
తన నడుముకు కట్టమంటది మా వదిన
।వదినకు ।

చెరువులొ ఉండే
కప్పల్ని చూసి
బోండాలంటది మా వదిన
తాను భోంచేస్తానంటది మా వదిన
।వదినకు ।

బండిని తోలే
బండోణ్ని చూసి
నా మొగుడంటది మా వదిన
ఎగిరి బండెక్కి కూర్చుంటది మా వదిన
।వదినకు ।

చదవండి :  బండీరా..పొగబండీరా... జానపదగీతం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *