హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జైలులో ఉన్న జగన్ కు ప్రచారం చేసి పెట్టి తద్వారా వైకాపాకు మరిన్ని ఓట్లు పడేలా కృషి చేయాలని కాకలు తీరిన చంద్రబాబు గారి నేతృత్వంలోని తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మాకు తెలుసు తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం విని విస్మయానికి గురవుతారని. కానీ నిజం నిష్టూరంగానే ఉంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్షోభంలో ఉంది. కాంగిరేసు ప్రకటనతో రాష్ట్రంలోని ప్రజలంతా ప్రాంతాల వారీగా విడిపోయి ఉద్యమ బాట పట్టారు. బాబు గారు కూడా కొద్ది రోజులు సమైక్యాంధ్ర ఉద్యమం ఊపుగా ఉన్న కోస్తాంధ్ర బాట పట్టారు. కానీ రెండు జిల్లాలకే తన యాత్రను పరిమితం చేసుకుని హైదరాబాదు బాట పట్టారు. ఇప్పుడు తాజాగా డిల్లీ బాట పట్టబోతున్నారు. ఇదంతా ఎందుకంటే బాబు గారి రూటు మ్యాపు తెలుసుకోవటం కోసం. హఠాత్తుగా బాబు గారు డిల్లీ యాత్ర చేయాల్సిన అవసరం ఏమిటి? అదీ తెలుగు వారి ఆత్మగౌరవ యాత్ర కట్టి పెట్టి మరీ – ఇదంతా మా జగన్ బెయిల్ అడ్డుకోనేందుకే అంటూ వైకాపా వారు ఆరోపించారు.
కానీ బాబు గారు బలంగా ఫిక్సయ్యారు – డిల్లీ వెళ్ళాలని. ఇంతలో కేశవ్ ఊరుకోకుండా జగన్ కేసు గురించి ఫిర్యాదు చేయటానికే మా నాయకుడు ఢిల్లీ వెళ్తున్నాడు అంటూ ముక్తాయించారు. ఇక వైకాపా వాళ్ళన్నారు – మేము చెప్పిందే నిజం. బాబు గారికి మా జగన్ విషయంలో ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యల గురించి లేదాయే అని. ఇంతలో బాబు జగన్ పనిని ఢిల్లీలోని తెదేపా పార్లమెంటు సభ్యులకు అప్పగించేశారు. వారు ఆ కార్యక్రమాన్ని 17వ తేదీనే పూర్తి చేశారు. ఎందుకంటే 18వ తేదీ జగన్ బెయిల్ పిటీషన్ విచారణకు వస్తుందని.
18వ తేదీ వచ్చే సరికి జగన్ కు విపరీతమైన ప్రచారం చేసి పెట్టాలని తెదేపా నిర్ణయించుకుంది. ఎందుకంటే 18వ తేదీన సిబిఐ జగన్ కేసులో విచారణ పూర్తయిందని కోర్టుకు చెప్పింది. కోర్టు తీర్పును 23కి వాయిదా వేసింది. ఇక్కడే తెదేపాను అనుమానం అనే భూతం పట్టుకుంది. ఏమిటది – ఇక జగన్ బెయిల్ మీద బయటకోస్తాడేమో అని. వెంటనే బాబు గారు తన అనుంగు కోటరీతో సమాలోచనలు చేశారు. ఆ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే జగన్ కు ప్రచారం చేసి పెట్టాలనట. వీలైనన్ని రకాలుగా జగన్ గురించి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రచారం చేయటానికి బాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేశవ్, వర్ల రామయ్యలను ఎంపిక చేశారు. బాగుంది. వీరు జగన్ గురించి ప్రచారం చేస్తే ఓట్లు పడతాయా?అని సందేహం రావచ్చు. వీళ్ళ మాటలను వీరి నియోజకవర్గంలోనే వింటారా? నియోజకవర్గంలో వినకపోవచ్చు. కానీ హైదరాబాదులో చెబితే వింటారు. ఎవరు – మీడియా వాళ్ళు. చెప్పిన రోజు టీవీలో, మరుసటి రోజు పేపర్లో. గ్యాప్ లేకుండా ఫోకస్ మొత్తం జగన్ మీదే. ఎంత అభిమానమో కదా!
సోమిరెడ్డికి భూ కేటాయింపులు, కేశవ్ కు జలయజ్ఞం, రేవంత్ రెడ్డికి జగన్ కుటుంబ సభ్యుల ఆస్తులు, వర్ల రామయ్యకు బ్యాంకులకు సంబందించి అంశాలను కేటాయించారుట.రేవంత్ అయితే మా బాగా మోకాలికీ, బోడిగుండుకీ లంకె పెడతారు. రామయ్య గ్యాప్ తీసుకోకుండా బలంగా అరుస్తారు. సోమిరెడ్డి కూడా మాంచి మాటకారే. కేశవ్ కూడా బాగా కనిపిస్తుంటారు ప్రెస్ మీట్ లలో. ఇక్కడ కూడా బాబు గారు సామాజిక న్యాయాన్ని మెండుగా పాటించారు. వీరు మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్తారు? మొత్తం జగన్ లేదా ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాలపడ్డారనే కదా!
ఇదేమైనా కొత్తగా కనుగోన్నారా? ఇదే విషయమై కదా సిబిఐ దర్యాప్తు జరిగింది. ఏమో నాకు తెలియదు. తెదేపా వాళ్ళేమన్నా ఒక అమెరికా ఎఫ్.బి.ఐ లాంటి ప్రైవేటు సంస్థతో దర్యాప్తు చేయిన్చారేమో!! చూద్దాం వాళ్ళెం చెప్పబోతారో?
ఇక్కడ ఇంకో మతలబు ఉంది. ఒకవేళ కోర్టు బెయిల్ తిరస్కరిస్తే వీరు జగన్ గురించి ప్రచారం చేస్తారా? చేయారా? ఏమో చేస్తారేమో!!
ఇదంతా చూస్తోంటే ఏమనిపిస్తోంది? అంటీ నాకైతే జగన్ బయటకు రావద్దని తెదేపా కోరుకుంటోంది అనిపిస్తోంది. అంతేనా వచ్చే ఎన్నికలకు తెదేపా ముందు జగన్ అనే అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది.
ఇతరత్రా అన్ని అంశాల కంటే జగన్ బాబే ప్రాధమ్యమున్న అంశంగా అవతరించారు మన నారా బాబు గారికి – ఇప్పుడు మన రాష్ట్ర ప్రజల ముందున్న సమస్యల కన్నా కూడా!!
adhikaaram kosam french,english vaallu enni kutralu lo kadapa navvabu,kurnool nawab, nijam varasalu bali ayyaro charitra chebutondi… ippudu adhikaara poru lo jagan abhimaanulu, baabu abhimaanulu ‘abhimaanam’ ane emotional feeling ku guri kaavaddu.. abhimaanam durabhiprayam ga marakunda chusukondi..abhimaanam durabhimaanam ga maarite ‘vichakshana’ (wisdom) kolpotaaru..adhikaara poru lo bhagam ga undi pi article