ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు (ఆంగ్లం: Proddatur లేదా Proddutur), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ప్రొద్దుటూరు పట్టణ పాలన ‘ప్రొద్దుటూరు పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. ప్రొద్దుటూరుకు ‘ప్రభాతపురి’ అని మరో పేరు …
పూర్తి వివరాలు'రామేశ్వరం'కు శోధన ఫలితాలు
విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలి : ఐఏఎస్ విజయభాస్కర్
ప్రొద్దుటూరు: విద్యార్థులు పాఠశాల దశ నుండే సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఇటీవలే ఐఏఎస్‌కు ఎంపికైన జిల్లా వాసి విజయభాస్కర్‌రెడ్డి పాతకోట పేర్కొన్నారు. స్థానిక రామేశ్వరంలోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సత్తిబాబు అధ్యక్షతన ఈ రోజు (శుక్రవారం) విజయభాస్కర్‌కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… …
పూర్తి వివరాలువైఎస్ హయాంలో కడపకు దక్కినవి
వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప …
పూర్తి వివరాలుఒంటిమిట్ట కోదండరామాలయం
రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… …
పూర్తి వివరాలుకడప జిల్లా పర్యాటక ఆకర్షణలు
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, …
పూర్తి వివరాలురేనాటి చోళుల పాలన
రేనాటి చోళుల పాలన – ఇతర విశేషములు రేనాటి చోళులు మొదట పల్లవుల తరువాత బాదామి చాళుక్యుల సామంతులుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయినప్పటికి పల్లవ మహేంద్రవర్మ కాలమునందు పుణ్య కుమారుడు స్వతంత్ర ప్రతిప్రత్తితో రేనాటి రాజ్యమును పాలించినట్లు అతడు వేయించిన తామ్ర శాసనములు, రామేశ్వరం శిలాశాసనం సూచిస్తున్నవి. రేనాటి చోళరాజులు తమను ప్రాచీన …
పూర్తి వివరాలుకడప జిల్లా శాసనాలు 1
తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 …
పూర్తి వివరాలుకడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !
విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. …
పూర్తి వివరాలుదాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి
చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.
పూర్తి వివరాలు