పెద్దకూతురు హరిత పుట్టిల్లు చేరి మూడు మాసాలు దాటింది. ‘తరాలు మారాయి సంస్కారాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. సామరస్యానికి మార్గమేమిటో ఏ రకంగా కుదురుతుందో అది?” అని హరిత తల్లి కస్తూరి తల్లడిల్లింది. సంస్కారం కొలిమిలో కాల్చటానికి తన కూతురు ఇనుమూకాదు, ఇత్తడీ కాదు, మనిషి రక్తమాంసాలున్న మనిషి. వాడి పీహెచ్.డి. చదువూ, ఆ యూనివర్శిటీ లెక్చరరు ఉద్యోగమూ తగలెయ్యనా? అని హరిత తండ్రి లెనిన్ బాబుకు ఆగ్రహం కలిగింది. తల్లిదండ్రుల తల్లడిల్లడాలూ, ఆగ్రహాలూ కాపురాల్ని సంధించలేవు. […]పూర్తి వివరాలు ...
Tags :కేతు విశ్వనాథరెడ్డి సాహిత్యం
కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని బట్టి, కదలికల్ని బట్టీ, పోలీసు స్టేషన్ ముందు ముసలి కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఆ ముగ్గురూ అటూ ఇటూ చూస్తూ నిల్చున్నారు. వాళ్ళకు దగ్గరలోనే మూడు బ్యాగులున్నాయి. మాకులాగే వాళ్ళకు కూడా ఎలక్షన్ డ్యూటీ పడినట్లుంది. మా రూటు లారీ ఆగీ ఆగగానే ఆ ముగ్గురాడపిల్లలూ బ్యాగులు పుచ్చుకొని లారీ వెనకవైపు నుల్బున్నారు. ఇరవై, ఇరవై అయిదేండ్లలోపు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6) ఈడిగ – ఈడిగపల్లె (17) ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు ఏకరి – […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
“విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా. వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు భూతపురి నారాయణస్వామి పండితుడూ, కవి. ఆ హైస్కూల్లో స్వయంగా తన కావ్యం శివభారతం పాఠం చెప్పిన, గొప్ప కవి గడియారం వేంకటశేషశాస్త్రి. ఇంట్లోవున్న […]పూర్తి వివరాలు ...
కూలిన బురుజు ఊరు దగ్గరికొచ్చింది. అంతకు ముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగుపెట్టబోతున్నాను. పుట్ట చెండ్లాట మాదిరి నాటుబాంబుల్తో ఆడుకున్న గ్రామ పార్టీల ప్రపంచంలోనికి ప్రవేశిస్తున్నాను. కక్షలూ, కార్పణ్యాల అడవిలోకి వెళుతున్నాను. కొత్త అనుభవం. పదేళ్ళ కిందట జ్ఞాపకాల్లో నిలిచిన ఊరు ఇది కాదనిపిస్తోంది. పక్క కళ్ళాల్లో మేపు కోసం వాముల దగ్గర కొచ్చే రైతుల సందడి లేదు. బండ్ల బాటలో నిత్యం ఎదురవుతుండే ఎద్దుల బండ్ల […]పూర్తి వివరాలు ...
జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...
చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...