నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463. నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన […]పూర్తి వివరాలు ...
పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం. చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి. పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది బ్రాహ్మణులు రాజు సహాయార్థం వేచి ఉంటారు. రాజు స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి దానాలు చేస్తు ఉన్నపుడు, 18 గోత్రాలకి సంబధించిన […]పూర్తి వివరాలు ...
ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. పూర్వం ఈతచేట్లు, తాటిచెట్లు విరివిగాఉన్న ప్రాంతంలో ఉండిన ఈ గ్రామానికి ఈతలపల్లె పేరు ఉండేది. ప్రజలు రోగగ్రస్తులు కావడంవల్ల ఈతలపల్లె ఉన్న ప్రాంతానికి పడమర వూరు కట్టుకుని ఊరట పొందినందున అప్పటి నుండి ఉరుటూరు అనే పేరు కలిగినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. “ఉరు” అంటే గొప్ప , ప్రాశస్త్యం గలిగిన అనే అర్థాలున్నాయి. అందువల్ల ఉరు+ఊరు= ఉరుటిఊరు […]పూర్తి వివరాలు ...
“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్ వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ బాగా పంటలు పండించే వారు. ఒక సారి జొన్న పంట అద్భుతంగా విరగ పండింది. కంకులు తిప్పి ఎత్తైన రాశులు పోశారు. జొన్నలను […]పూర్తి వివరాలు ...
తెలుగు వారు మరువలేని ఆంగ్లేయులు కొందరున్నారు.సాహిత్యానికి సేవ చేసిన బ్రౌన్,లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన కాటన్,స్థానిక చరిత్రలను ఏకరించిన కల్నల్ కాలిన్ మెకంజి.1810-15 మధ్య మద్రాస్ surveyor general గా 1816-21 వరకు భారతదేశ మొదటి surveyor generalగా పనిచేసిన ఈయన గ్రామ చరిత్రలను సేకరించాడు.వీటినే కైఫియత్లు,దండెకవిలె లు అంటారు.వీటిలో కడప కైఫియత్లను 5 భాగాలు గా కడప c.p.brown memorial పూర్తి వివరాలు ...
మేడిదిన్నెకు కరణంగా ఉండిన ప్రధమలు చంచురాజు అనే ఆయన ఈ కైఫీయత్ ను రాయించినాడు. చిన్న పసుపుల గ్రామానికి దగ్గర్లో పూర్వం ఎత్తైన స్థలం (దిన్నెలేదా గడ్డ)లో ఒక పెద్ద మేడి (అవుదుంబర) చెట్టు ఉండేదట. కొన్నాళ్ళకు ఆ మేడిచెట్టు ఉన్నటువంటి దిన్నె మీద ఒక ఊరు ఏర్పడిన తరువాత ఆ ప్రాంతము మేడిదిన్నెగా వాడుకలోనికి వచ్చినది. పూర్వము నుంచీ ఈ ప్రాంతం ఉదయగిరి రాజ్యంలో భాగమైన గండికోట సీమలో భాగంగా ఉండేదిట. ఇలా ఉండగా కృష్ణదేవరాయలు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా శిద్దవటం నుండి నాలుగు ఇండ్ల పేర్లుగల 95 మంది కోమట్లు రైల్వే కోడూరు సమీపంలోని కుంట ప్రాంతానికి వచ్చి ఇండ్లు నిర్మించుకొన్నారు. వారు దారిన వచ్చిపోయే వారికి అవసరమైన దినుసులు అమ్ముకొని జీవించేవారు. కోమట్లు ఏర్పరిచిన ఊరు అయినందున ఆ ప్రాంతానికి శెట్టి కుంట అనే పేరు వాడుకలోనికి తెచ్చారు. (కడప జిల్లాలో కోమట్లను (వైశ్యులను) ‘శెట్టి’ అని వ్యవహరిస్తుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న తమిళనాడులో సైతం కోమట్లను ‘శెట్టియార్’ లేదా ‘చెట్టియార్’ అని […]పూర్తి వివరాలు ...
భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...
జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె ( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.) కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో విజయనగర పాలకుడు ప్రౌఢ దేవరాయలు పరిపాలించేవారు. డిండిమ భట్టారకుని జయించాలన్న తపనతో శ్రీనాథుడు వున్నారు. ఆ సమయంలో మోపూరు పాలకుడుగా వల్లభరాయుడు వుండేవారు. […]పూర్తి వివరాలు ...