ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తులపై గళమెత్తు జిత్తులపై కలమెత్తు పిడికిల్లే విచ్చు కత్తు ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ.. ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు….. రావాల్చిన రాజధాని.. రాకుండా పాయరా వచ్చాయన్న సాగునీరు మనది కాదు సోదరా నిధులు లేని గడ్డరా నిరుద్యోగ బిడ్డరా ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు.. నవ్యాంధ్ర ముసుగులో రాయలసీమ బుగ్గిరా వదిలావా పగ్గాలు ఎద్దు నీది కాదురా సేద్యం సెయ్యలేవురా సేను బీడు ఆయరా బతుకు మోయలేవురా.. ఓ అమ్మా ఓ అక్కా ఓ నాన్నా […]పూర్తి వివరాలు ...
మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ సేతబట్టీ… కిర్రు సెప్పూలేసుకోని కట్ట మీదా పోతావుంటేరో… నా కొడకా మానందీరెడ్డీ నువ్వు కలకటేరనుకొంటిరో… మల్లు పంచా కట్టుకోనీ నల్లకోటు ఏసుకోని సందు […]పూర్తి వివరాలు ...
ఊరూ నిదరోయింది.. మెరుపూ మెరిసేసింది మెరుపులోన నా సోకంతా కరువుదీర సూదువుగాని బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నందుకోవా!! | ఊరూ నిదరోయింది| మరుమల్లె తోటకాడ మల్ల నిన్ను కలుత్తనాని మాట సెప్పి మరిసీనావే.. బూటకాలు సేసినావే (2) అత్త కొడుకువనీ…అందగాడివనీ.. కొత్త వలపులను తెచ్చితి రారా బావా… నన్ను సేరుకోవా! బావా… నన్నల్లుకోవా!! జొన్నసేని మంచెపైన నన్ను ముద్దుసేసి శాన (2) ముద్దబంతి పూలసరమూ మురిపెంగా తెత్తానంటివి(2) మామకూతురని, మరదలు పిల్లని మాటలోనే ఏమారిసిపోదువా బావా… […]పూర్తి వివరాలు ...
వర్గం: వీధిగాయకుల పాట పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం) పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికి మొనగాడు ఆ.. పెట్టి మాటలు ఏదాలూర రండి శూరులారా.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ […]పూర్తి వివరాలు ...
ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రసారమైన సీతాకల్యాణం హరికథ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం…. గానం చేసినవారు : శ్రీ రాజయ్య శర్మ భాగవతార్ గారు క్రింద ప్లే బటన్ నొక్కడం ద్వారా హరికథ వినవచ్చును. గమనిక : ఈ కథను వినుట ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ లో కొన్నిసార్లు సాధ్యపడక పోవచ్చు. మీరు ఒకవేళ ఫైర్ ఫాక్స్ వినియోగిస్తున్నట్లయితే దయచేసి గూగుల్ క్రోం లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఈ పుటను తెరవండి. పూర్తి వివరాలు ...
ఆంధ్రప్రదేశ్లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో సెగమంటలు రేపుతుంటే మరో పక్క సాంస్కృతిక స్పృహను రగుల్కొలుపుతోంది. రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ప్రాంతం. ఇక్కడి ప్రజల మాటల్లో నిజాయితీ, నిక్కచ్చితనం ఉట్టిపడుతూ ఉంటుంది.ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఖరాఖండీగా చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనస్తత్వం. మాటైనా , పాటైనా ఘాటుగా స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ సీమ పల్లెప్రజలు..! సమైక్యాంధ్ర ఉద్యమం.. సందర్భంగా ప్రజల్లోనుంచి అనేకమంది కళాకారులు ఉద్యమ వేదికలపైకి స్వచ్ఛందంగా […]పూర్తి వివరాలు ...
బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా 1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ 1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ !బే1 అందగాడవవుదు లేవయా-గోపాల గో విందా రచ్చించ రావయా పందిలోన సేరి కోరపంటితో […]పూర్తి వివరాలు ...
“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు.. 1940 లో […]పూర్తి వివరాలు ...