కరువుటెండలో వాడిపోతున్న మట్టిపూలు రాలిపోతున్నాయి వెన్నెముకగా నిలవాల్సిన అన్నదాతలు నిలువ నీడలేక నేలకొరగిపోతున్నారు మేఘాల చినుకుల కోత కరువులో ఆకలిమంటల కోత నిరంతరం సీమలో రైతన్నలకు రంపపు కోత పచ్చని ఆకులా నవ్వాల్సిన రైతన్న ఎండుటాకులా ఎముకలగూడై మిగిలాడు పరిమలాలు వెదజల్లాల్సిన మట్టివాసన కుల్లినశవాల వాసనతో మలినమయ్యింది బురద నీల్లలో దుక్కిదున్నాల్సిన కాల్లకు కాలం సంకెల్లువేసి వికట్టాటహాసం చేస్తుంది మట్టిమీద సంతకం చేయాల్సిన వానచినుకు మబ్బుతునక కౌగిట్లో బంధీగామారింది ఇంటిగుమ్మానికి ధీనంగా వేలాడే ఎండిపోయిన మామిడి ఆకుల్లా […]పూర్తి వివరాలు ...
వాన మాట విన్పిస్తే చాలు చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి మేఘాల నీడలు కదిలితే చాలు కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది ఒక్క వాన వొంగితే చాలు ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ ! ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు బీడీ ముక్కలమై మినుకు […]పూర్తి వివరాలు ...
కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. బద్దలవబోయే సీమ నిశ్శబ్ద ఘీంకారం ఎర్ర చందనం నీ సొత్తు కాదిక అది నా సీమ అస్తిత్వం అది మొరటుతనం కాబోదిక మాది నిప్పంటి సీమ కరుకుతనం కూరలో కరేపాకు కాదిక పోరులో కుర్రాళ్ళ జజ్జనక బీడుకట్టు కాదిక గోసెగ్గట్టిన ముళ్ళగట్టె నవ్యాంధ్ర కాదిక నాది నవసీమ గొంతుక జై రాయలసీమ జై జై రాయలసీమ […]పూర్తి వివరాలు ...
నిధుల్లో వాటా సెప్పల్య నీళ్ళ కాడ కాటా బెట్టల్య ఉద్యోగాల్లో కోటా ముట్టల్య ఎముకలేని నాళికతో గాలిమేడల మాటల్తో నోటికాడ కూడు లూటీ సేసే వాటమైన కేటుగాడు ఈడు ఒరేయ్………. జూట్ కా బేటా నీ తాట ఒల్సి మెట్లుగుట్టుకోడానికి నా రాయలసీమ రాటు దేల్తాంది జిల్లాల వారీ ప్రణాళికలట గల్లీల్ని కూడా ఖిల్లాల్ని సేచ్చాడట కరువు సీమకు కన్నీళ్ళ సెరువులట కోయలకు నెత్తుటి పో’లవరాలట’ పుకార్ల పోట్లంతో షికార్లు సేసి తల్లి వేరునే తెగనరికే టక్కర్ […]పూర్తి వివరాలు ...
సామీ నమస్కారం…. మాకు పంగనామాలు పెట్టిన సామీ నీకు నమస్కారం అమ్మ నోట్లో మన్ను కొట్టి అబద్దాలు ఆరవోసిన సామీ నీకు నమస్కారం సొమ్ములున్న సోగ్గాళ్ళ కౌగిట బందీవై మము వెక్కిరించిన సామీ నీకు నమస్కారం! సభ సాక్షిగా సీమకు మకిలిని అంటగట్టిన సామీ నీకు నమస్కారం! రాజధాని పేర రంకు నడిపి ప్రకాశం పేరును బొంకిన సామీ నీకు నమస్కారం! ఉత్తుత్తి వరాలతో ఊదరగొట్టి పేపర్లతో అదరగొట్టించిన సామీ నీకు నమస్కారం! సొంతింటి పేరు సెప్పి […]పూర్తి వివరాలు ...
రాళ్ళసీమ అంటనారు గదా రాసుకున్న హామీలపత్రం కూడా ఉంది గదా అదేదో ఆ సింగపూరన్నా కాలబడి మా ఊరికొచ్చే బేకారుగా తిరిగే మా పిల్ల నాయాల్లకు రెండు జీతం పరకలన్నా దొరుకతాయి అని ఆశపడి రాజధానిని అడుగుదామని పోతే ‘రస్తాలో లేవు పోచ్చాయ్ ……’ రౌడీ నా కొడకా అంటా ఎగిచ్చి తమ్తిరి! ఉరితాళ్ళు మీ ఇంట యాలాడనప్పుడు దుక్కిసాల్లు నిన్ను యంటబడి ఏటాడి మట్టుబెట్టనప్పుడు అవును మరి, కరువు ఎవరికి సేదు? ఒక్క మా రాయలసీమ […]పూర్తి వివరాలు ...
యంత మది పగలూ రాత్రీ మన్నులో పులుగుల మాదిరీ కష్టం సేస్తే మాత్ర ఏమి?? వాడు–ఎన్నుమీద గువ్వ ఒగ గింజగూడామిగల్నీడు!! *** యంత సేపు మునిగి మునిగి మజ్జిగ గుత్తిమాదిరి పెరుగు సిలికితే మాత్రమేమి?? వాడు కడవమింద సెయ్యి యన్నంతా దేవుకొంటాడు!!పూర్తి వివరాలు ...
రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ రైతు గుండెలన్ని ముళ్లచెట్ల కంపలాయె ఎన్నాళ్లీఅగచాట్లు అన్నన్నా తిరగబడు. రైతు కంటి నీళ్లతో పంటలెలా పండుతాయి మభ్య పెట్టు మాటలతో పరిపాలనెలా సాగుతుంది. […]పూర్తి వివరాలు ...
తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి? కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ కరువు పుండాయ బతుకు ఎండిపాయ నిండా మునిగినాక సలేంది, గిలేంది! ఇంగ మన బాట […]పూర్తి వివరాలు ...