ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి ఎదిగింది . ఐదారు గ్రామ పంచాయితీలను వీలినం చేసి అప్పట్లో ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేశారు. .పూర్తి వివరాలు ...
రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..పూర్తి వివరాలు ...