నేషనల్ అల్యూమియం కంపెనీ లిమిటెడ్ ( నాల్కో ) వై.ఎస్.ఆర్ జిల్లా లోని గండికోటలో 274 కోట్ల రూపాయల వ్యయంతో 50.4 ఎం.వి. పవన విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ 274 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తుందని నాల్కో సి.ఎం.డి బాగ్రా భువనేశ్వర్ లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ఒక్కొక్కటి 2.1 ఎం.వి. సామర్థ్యంతో 24 గాలిమరలను గండికోట సమీపంలో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని […]పూర్తి వివరాలు ...
స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు.. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్థం లేని ఆచారాలు, దురాచారాలు, అధికార బలం, దబాయింపులతో ప్రజలను మోసంచేసి అణచిపెట్టేవారు. అటువంటి చిమ్మచీకటి తెరలను చీల్చుకుని వెలిగిన వేగుచుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము . (1608-1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖ పరిచయం లేకున్నా ఒకే ఆశయంతో […]పూర్తి వివరాలు ...
మైలవరం: కోరిన వారికి కొంగు బంగారంగా మైలవరం మండలం దొమ్మరనంద్యాల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీ దేవి జ్యోతి మహోత్సవాలు ఈ నెల 16 వ తేదీ ఆదివారం నుండి 18 వ తేదీ మంగళవారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా 16 వ తేదీ బిందుసేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి జ్యోతులను ఊరేగిస్తారని, 17 న విడిదినం, 18 న గొడుగుల కార్యక్రమం ఉంటుందని అలాగే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయంపూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు అమ్మవారిశాల (శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం) పట్టణానికే తలమానికంగా విరాజిల్లుతోంది. జగములనేలే జగజ్జననిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ప్రసిద్ధికెక్కింది. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం 121 ఏళ్ల క్రితం కామిశెట్టి కొండయ్య శ్రేష్టి ఆధ్వర్యంలో రూపుదిద్దుకొంది. చిన్నకొండయ్యకి కలలో అమ్మవారు కనిపించి తనకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో 1890 లో ప్రొద్దుటూరులో ఆయన అమ్మవారిశాలను నిర్మించారు. ఆలయ నిర్మాణంలో నాణ్యమైన రంగూన్ టేకును వినియోగించారు. ప్రొద్దుటూరు అమ్మవారిశాలలోని శిల్పాలు ఎంతో ఆకర్షణీయమైనవిగా […]పూర్తి వివరాలు ...
గ్రామాల్లో అనేక తరాలుగా వివిధ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారని చెప్పడానికి కోరవానిపల్లె గొర్రెల కాపరులు నిదర్శనంగా నిలిచారు. తొండూరు మండలం లోని కోరవాని పల్లెలో ఆదివారం (2/9/2011) ముద్దల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి గొర్రెల మందల వద్ద గొర్రెల కాపరులు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా జొన్న ముద్దలుపూర్తి వివరాలు ...
రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.పూర్తి వివరాలు ...
నందలూరు : ‘సాహిత్యం ద్వారానే సామాజిక స్పృహ పెరుగుతుంది. సమాజం మంచి మార్గంలో నడవడానికి కథ మార్గదర్శనం చేస్తోంది. కథకు మరణం లేదు’ అంటూ తెలుగు కథకు ఉన్న ప్రాధాన్యాన్ని పలువురు సాహితీ ప్రముఖులు వివరించారు. నందలూరులో ఆదివారం గొబ్బిళ్ల శంకరయ్య మెమోరియల్ స్కూల్ ఆవరణంలో కళింగాంధ్ర ప్రాంతానికి చెందిన కథకులు అట్టాడ అప్పల్నాయుడుకు కేతు కథా పురస్కారం, ఏఎన్ జగన్నాథశర్మకుపూర్తి వివరాలు ...
కడప : కడప- చిత్తూరు జిల్లాల సరిహద్దులో సరిహద్దులోని బొంతకనుము రెండవ కల్వర్టు వద్ద పోలీసుల సోదాలో మూడు మందు పాతరలు, ల్యాప్‌ట్యాప్ లభ్యం కావడం సంచలనం రేపింది. సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి పర్యటన తన సొంత నియోజకవర్గంలో బుధవారం అర్ధాంతరంగా వాయిదాపడడంతో పోలీసుల సోదాలు నిర్వహిస్తుండగా గురువారం మందుపాతరలు లభ్యం కావడం గమనార్హం!. సీమ జిల్లాల్లో మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారని పోలీసులు భావిస్తున్న ..పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లా వందలాది మంది పాలిట మృత్యువు జిల్లాగా మారింది. వైద్య శాఖ నిర్లక్ష్యం వల్ల గత కొద్ది రోజులుగా జిల్లాలో మృత్యువు భూతం నాట్యం చేస్తోంది. ఎందరో ప్రాణాలను బలికోంటోంది. ఎన్నో కుటుంబాలు కన్నీటి పాలవుతున్నాయి. మొన్నటి మొన్న రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కరీంనగర్ జిల్లాలో వికటహాసం చేసి ఎందరో ప్రాణాలను బలికొన్న డెంగ్యూవ్యాధి నేడు కడప జిల్లా కబలించింది. నెల రోజుల్లో సుమారు 50 మంది జిల్లా వాసులుపూర్తి వివరాలు ...