సంపాదకుడు

చరిత్ర పర్యాటకం

పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం “దుర్గం కోట “

పులివెందుల: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కాని వారి నిర్మించిన కట్టడాలు మాత్రం మనకు సజీవ సాక్ష్యాలు గా కనిపిస్తాయి. అప్పట్లోనే కారడవుల్లో విశాలమైన కోటలు నిర్మించారు. కానీ వాటి గురించి నేడు పట్టించుకొన్ననాధుడే లేడు. కాల గర్భంలో ఒక్కొక్కటే కలసి పోతున్నాయి. ఈ పురాతన కట్టడాలు ఉన్న ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రజలు కొంత వరకైనా వీటి పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం. కట్టడాలూ బాగుపడతాయి…పూర్తి వివరాలు ...

వార్తలు

కుందూ వరద కాలువకు నీరు-కెసి ఆయకట్టుకు మరణ శాసనం

కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే  కెసి ఆయకట్టు పాలిట మరణ శాసనంగా మారుతుందని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కుందూ – పెన్నా వరద కాలువకు నీరు ఇస్తే కెసి రైతాంగానికి నీరు సరఫరా ఉండదని రైతులను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రొద్దుటూరుకు తాగునీరు సరఫరా చేయాలని మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డి.ఎన్.నారాయణ కోరారు.  జిల్లా కెసి కాలువ ఆయకట్టు స్థిరీకరణ […]పూర్తి వివరాలు ...

ఆలయాలు పర్యాటకం

నందలూరు సౌమ్యనాథ ఆలయం

భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలకు నిలయంగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి కట్టడాలలో కడప జిల్లాలోని  నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్పకళా సంపదకు అలవాలమై బాహుదానదీ తీరాన అహ్లదకరమైన ప్రశాంత వాతావరణంలో తూర్పుముఖంగా వెలిసివుంది. కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో ఈ ఆలయం వెలసివుంది. ఈ నందలూరును పూర్వపుకాలంలో నీరందనూరు, […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు వ్యాసాలు

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను పురస్కరించారు. జెైన మత ప్రచారం కోసం మత ప్రచారకులు స్థానిక భాషలను ప్రోత్సహించడమే ఇందుకు ముఖ్య కారణం. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు […]పూర్తి వివరాలు ...

ఆలయాలు పర్యాటకం

రాయచోటి వీరభద్రాలయం

రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం. ఆనవాయితీ మరో విశేషం ఏమంటే ముస్లింలలోని దేశముఖితేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆ పూజా సామగ్రితో పూజలు నిర్వహించి […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు పర్యాటకం వార్తలు

మాచుపల్లె శ్రీ రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు

సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామంలో పవిత్ర పెన్నానది ఒడ్డున  వెలసిన శ్రీ శ్రీ జగజ్జనని రేణుకా యల్లమాంబ వార్షిక  తిరుణాల మహోత్సవాలు వైశాఖ మాసం బహుళ పాడ్యమి నాడు ( మే 5వ తేది ) ధ్వజారోహాణ, అంకురార్పణ కార్యక్రమమలతో సొమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసం బహుళ తదియ రోజున ( మే 6 వ తేదీన ) అమ్మవారి వూరేగింపు, పాట కచేరి జరిగాయి. ( 9 వతేదీ ) అమ్మవారి కళ్యాణం, ఏనుగు వాహనం పై […]పూర్తి వివరాలు ...

చరిత్ర పర్యాటకం

‘మిసోలిథిక్‌’ చిత్రాల స్థావరం చింతకుంట

కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలోని ఆది మానవుల శిలా రేఖా చిత్రాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం. తొలిసారిగా ఇర్విన్‌ న్యూ మేయర్‌ అనే ఆస్ట్రియా దేశస్థుడు ” లైన్స్‌ ఆన్‌ స్టోన్‌ – ది ప్రి హిస్టారిక్‌ రాక్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా“ అనే పుస్తకంలో చింతకుంట రేఖా చిత్రాల గురించి సచిత్రంగా, సవివరంగా పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి పెద్దదైన, ప్రముఖమైన మిసోలిథిక్‌ కాలానికి (బిసి 8000-1500) చెందిన రేఖా చిత్రాల స్థావరంగా చింతకుంటను […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు సాహిత్యం

కడప జిల్లాలో రామాయణ రచనా పరిమళం

కడప: తిరుమల తర్వాత అంతటి గొప్ప క్షేత్రంగా దేవుని కడపను చెప్పినట్టే.. భద్రాచలం తర్వాత ఒంటిమిట్టకు అంత ప్రశస్తి ఉందంటారు. వాస్తవానికి భద్రాద్రి కన్నా ఒంటిమిట్ట ఎంతో పురాతనమైనది. దీన్ని రెండవ భద్రాద్రి అనడం కన్నా భద్రాచలాన్నే రెండవ ఒంటిమిట్టగా పేర్కొనడం సమంజసమంటారు ఇక్కడి పురాణ ప్రముఖులు. ఒంటిమిట్టలాంటి గొప్ప క్షేత్రమున్న ఈ జిల్లాలో శ్రీరాముని పవిత్ర హస్త స్పర్శతో పునీతమైన క్షేత్రాలుగా పేరుగాంచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రొద్దుటూరులోని ముక్తిరామేశ్వరాలయం. ఈ ఆలయంలోని […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు వ్యాసాలు

“.. తెలుగు లెస్స ”అన్నది ” మోపూరు ” వల్లభరాయలే!

జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు దెనుగు లెస్స జగతి దల్లి కంటె సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె ( క్రీడాభిరామం -రచన వినుకొండ వల్లభరాయుడు.) కడప జిల్లా పులివెందుల ప్రాంతంలోని మోపూరు గ్రామంలోని భైరవేశ్వర ఆలయం నేటికీ  వుంది. ఇది వీరశైవులకు ప్రసిద్ధ క్షేత్రం. (క్రీ.శ.1423 -1445) ప్రాంతంలో విజయనగర పాలకుడు ప్రౌఢ దేవరాయలు పరిపాలించేవారు. డిండిమ భట్టారకుని జయించాలన్న తపనతో శ్రీనాథుడు వున్నారు. ఆ సమయంలో మోపూరు పాలకుడుగా వల్లభరాయుడు వుండేవారు. […]పూర్తి వివరాలు ...