కొండపేట కమాల్ “నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల […]పూర్తి వివరాలు ...
Search Results for: కొండపేట
కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు. దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు […]పూర్తి వివరాలు ...
అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక సభ’ స్థాపించారు. అప్పటి నుండి క్రమశిక్షణతో ‘హరిశ్చంద్ర’, ‘శకుంతల’ నాటకాలు తయారుచేసి ఇటు రాయలసీమ. అటు సర్కారు జిల్లాలలో విశేషంగా ప్రదర్శనలిస్తూ నాటక […]పూర్తి వివరాలు ...