గురువారం , 21 నవంబర్ 2024
పెద్దచెప్పలి ఆలయాలు
పెద్దచెప్పలి చెన్నకేశవాలయం

పెద్దచెప్పలి ఆలయాలు – చరిత్ర

కమలాపురం సమీపం లోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన పురాతన దేవలాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది.

అగస్త్యేశ్వర ఆలయం

ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. తన శాసనాలన్నింటినీ తెలుగులోనే వాడాడనటానికి అగస్త్యేశ్వరాలయంలోని స్తంభాలకు చెక్కబడిన తెలుగు శాసనాలే నిదర్శనం. ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. నం దివాహనంపై శివపార్వతులు గల అరుదైన విగ్రహం ఉండటం ఇక్కడి విశేషం. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మీద శివాలయాలలో ఎక్కడా ఇలాంటి విగ్రహాలు లేవు.

పెద్దచెప్పలి ఆలయాలు

చెన్నకేశవ ఆలయం

వీటి పక్కనే ఉన్న శ్రీలక్ష్మీసమేత చెన్నకేశవ ఆలయాన్ని 1323లో విజయనగర రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. విశాలమైన ఆవరణం, రెండు పెద్ద గాలి గోపురాలు, శుభకార్యాలకు పెద్ద వంటశాల, పెండ్లి మంటపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు కావాల్సిన వ్యయం సమకూర్చుకునేందుకు ఎల్లారెడ్డి గ్రామ పొలంలో 26 ఎకరాల దేవుడి మాన్యం ఉంది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2000

సర్‌థామస్‌ మన్రో ఈ ఆలయాల నిర్వహణ కోసం రూ. 501 శిస్తు ఏటా ఖర్చు చేసినట్లుగా మెకంజీ కైఫియత్తులలో రాసి ఉందని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

గాలి గోపురాలలో అగస్త్యేశ్వర ఆలయ గోపురం జీర్ణావస్థలో ఉన్న సమయంలో ఇక్కడి ఖరీదైన పంచలోహ విగ్రహాలను పూజారి సుబ్రమణ్యం ఇంటిలో ఉంచగా 2004 సంవత్సరం ఆగస్టు 21న వాటి చోరీకి ప్రయత్నాలు జరగడంతో భద్రత కోసం విగ్రహాలను పోలీసులకు అప్పగించారు.

పెద్దచెప్పలి ఆలయాలు
స్థంభంపైనున్న తెలుగు శాసనం

2007 ఫిబ్రవరి నుంచి సేకరించిన డబ్బుతో కొంత వరకు జీర్ణోద్ధరణ పనులు జరిగాయి. పంచలోహ విగ్రహాలు పోలీసు ల నుంచి తీసుకువచ్చి ఏటా కార్తీకమాసంలో కల్యాణం చేస్తున్నారు. రోజూ ఆలయంలో పూజలు నిర్వహించడంతోపాటుగా ప్రతి సోమవారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాలిగోపురాన్ని పునద్దరురించి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.

చదవండి :  కడప జిల్లా శాసనాలు 1

యెల్లమ్మ ఆలయం

అలాగే గ్రామంలోని  చెప్పలి యెల్లమ్మ ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరు గాంచింది. యెల్లమ్మ తల్లి గ్రామంలోని ఒక గ్రామాధికారి ఇంట్లో ఉద్భవించినత్లుగా స్థలపురాణం వల్ల తెలుస్తోంది. చైత్రమాసం బహుళ ఏకాదశి దినాన్ని పురష్కరించుకుని గ్రామంలో ఏడు రోజుల పాటు జాతర జరిపే ఆచారం ఉంది. యెల్లమ్మ గుడికి పూజారిగా ఆత్రేయస గోత్రానికి చెందిన భట్రాజు వంశస్తులు వ్యవహరించడం పురాతన ఆచారం.

పెద్దచెప్పలికి ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గంలో:

చదవండి :  భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

దగ్గరి విమానాశ్రయం: కడప (25 కి.మీ), తిరుపతి (168 కి.మీ), బెంగుళూరు (290 కి.మీ), చెన్నై (305 కి.మీ),  హైదరాబాదు (430 కి.మీ)

రైలు మార్గంలో:

దగ్గరి రైల్వేస్టేషన్: కమలాపురం (10 కి.మీ), యర్రగుంట్ల (28 కి.మీ), కడప (30 కి.మీ)

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్ స్టేషన్: కమలాపురం (10 కి.మీ), యర్రగుంట్ల (28 కి.మీ), కడప (30 కి.మీ)

ప్రయివేటు వాహనాలలో:

బెంగుళూరు వైపు నుండి : చింతామణి, మదనపల్లి, రాయచోటి, గువ్వలచెరువు, కడప మీదుగా

చెన్నై వైపు నుండి : తిరువళ్ళూరు, ఊత్తుకోట, పుత్తూరు, రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, కడప  మీదుగా

హైదరాబాదు వైపు నుండి : జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, మైదుకూరు, కమలాపురం మీదుగా

విజయవాడ వైపు నుండి : గుంటూరు, ఒంగోలు, కావలి, ఉదయగిరి, బద్వేలు, మైదుకూరు, కమలాపురం మీదుగా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: