నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను ఎలాగూ తితిదే వాళ్ళు నూరుకోట్లతో అభివృద్ధి చేస్తున్నారు కదా? అది చాలదన్నట్లు మరీ కక్కుర్తిగా చిన్నాచితకా దేవస్థానాలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రెండుకోట్లకు కూడా […]పూర్తి వివరాలు ...
Search Results for: శిల్పారామం
కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...
కడప: నగరంలోని పాతబస్టాండ్ నుంచి రిమ్స్ ఆసుపత్రికి రోజుకు ఎనిమిది సార్లు తిరిగేలా సోమవారం నుంచి ఆర్టీసి బస్సు సర్వీసు ప్రారంభమైంది. నగర శివారులో ఉన్న రిమ్స్ ఆసుపత్రికి కొన్నాళ్లుగా బస్సు సౌకర్యంలేదు. దీంతో రోగులు, వారి సహాయకులు, ఉద్యోగులు ఆటోలను ఆశ్రయించేవారు. ఉదయం 8.45 గంటలకు పాత బస్టాండ్‌లో మొదలయ్యే ఈ బస్సు.. ఏడురోడ్లు, పాతరిమ్స్, కోటిరెడ్డి కూడలి, ఎర్రముక్కపల్లె, కలెక్టర్ బంగళా, శిల్పారామం మీదుగా రిమ్స్‌కు చేరుకుంటుంది. పాత బస్టాండు నుండి రిమ్స్ కు ప్రయాణ […]పూర్తి వివరాలు ...
భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలకు నిలయంగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి కట్టడాలలో కడప జిల్లాలోని నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్పకళా సంపదకు అలవాలమై బాహుదానదీ తీరాన అహ్లదకరమైన ప్రశాంత వాతావరణంలో తూర్పుముఖంగా వెలిసివుంది. కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో ఈ ఆలయం వెలసివుంది. ఈ నందలూరును పూర్వపుకాలంలో నీరందనూరు, […]పూర్తి వివరాలు ...
వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్‌కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. […]పూర్తి వివరాలు ...