ఘటనలు

Nov
10
Thu
సిపి బ్రౌన్ పుట్టిన రోజు
Nov 10 all-day
సిపి బ్రౌన్ పుట్టిన రోజు

కడప కేంద్రంగా తెలుగు బాషా సముద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్‌. వీరు 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో తండ్రి మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. 1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు.

1826లో రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. కడపలో గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు.

1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువులను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు.

1841లో చెన్న పట్టణ  పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత మదరాసు  విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు.

తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే  చందస్సును అచ్చు వేయించారు.  ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు .

Nov
22
Tue
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
Nov 22 all-day
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Nov
24
Thu
రారా వర్ధంతి
Nov 24 all-day
రారా వర్ధంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

 

Jan
22
Sun
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు
Jan 22 all-day
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు

తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్‌ పూర్తిపేరు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలుతో సమానం) తెలుగు సాహిత్యానికి సేవచేయడానికై ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్‌ కాలేజ్‌ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకోసం కట్టించిన భవన శిథిలాలమీద నేటి సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించింది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ 1974 లో సి.పి.బ్రౌన్‌ పరిశోధనా పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఆచార్య జి.ఎన్‌.రెడ్డి అధ్యక్షుడు కాగా బంగోరె(బండి గోపాలరెడ్డి) పరిశోధకుడుగా ఉండేవారు. ఈ ఇద్దరు లండన్‌లో ఉండినటువంటి వేల పుటల వ్రాతప్రతులను తెప్పించారు. దాదాపు 20 సంపుటాల లేఖలు తెప్పించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేనువేల రూపాయల గ్రాంటును మంజూరుచేసింది.

ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, బంగోరెలు తమ పరిశోధనలో భాగంగా కడపకు అనేక పర్యాయాలు వచ్చారు. బ్రౌన్‌, రచనలు ఆయన స్వీయచరిత్ర ఆధారంగా ఒక పర్యాయం సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. తరువాత వాళ్ళు అప్పటి జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డి గారిని కలుసుకొని సి.పి.బ్రౌన్‌ తెలుగు సాహిత్యానికి సేవచేసిన స్థలంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని కోరారు.

జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డిగారు అప్పటి సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థల యజమాని శ్రీ సి.ఆర్‌.కృష్ణస్వామి గారి నుండి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా పొందడంలో విజయం సాధించారు. గ్రంథాలయ నిర్మాణం పనిని అప్పటి కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షకార్యదర్శులైన డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి అప్పజెప్పారు.

1986లో స్థలదాత శ్రీ సి.కె.సంపత్‌కుమార్‌ గారు (సి.ఆర్‌.కృష్ణస్వామిగారి కుమారుడు) అధ్యక్షుడుగా, జిల్లా కలెక్టర్‌ ప్రధాన పోషకుడుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కార్యదర్శిగా సి.పి.బ్రౌన్‌ స్మారక ట్రస్టు ఆవిర్భవించింది.

1987 జనవరిలో శ్రీ జంధ్యాల హరినారాయణ గారు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఆయన గ్రామీణ క్రాంతిపథం నిధులనుండి మూడున్నర లక్షల రూపాయలు ట్రస్టుకు మంజూరుచేశారు.

1987 జనవరి 22 న గ్రంథాలయ భవనానికి పునాది వేయబడినది. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ జి.కృష్ణమూర్తి గారు ఆ సంస్థనుండి మొదటి దఫాగా 43,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు.

Feb
26
Sun
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
Feb 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

Mar
15
Wed
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
Mar 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

Apr
1
Sat
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
Apr 1 all-day

పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది.

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

May
21
Sun
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
May 21 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

May
30
Tue
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు
May 30 all-day
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు

విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది.

గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు.

2019 శాసనసభ ఎన్నికలలో జగన్ పులివెందుల స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

 

Jul
7
Fri
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
Jul 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.