Search Results for: తవ్వా ఓబుల్ రెడ్డి

చరిత్ర వార్తలు

పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయటపడినాయి

కడప జిల్లా మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు బయటపడినాయి. యెల్లంపల్లె గ్రామానికి చెందిన గవిరెడ్డి నాగ ప్రసాద రెడ్డి,మూలే శంకర రెడ్డి పొలాల వద్దగల భైరవుని బావివద్ద ఈ శాసనాలు,శిల్పాలు ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి, సమాఖ్య మైదుకూరు శాఖ అధ్యక్షుడు అరబోలు వీరాస్వామి గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకుని ఈవిషయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ […]పూర్తి వివరాలు ...

కవితలు

తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!

ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని రోంత దూరమన్నా పోయింది ల్యాకపాయ మా సిన్నాయన ఒకసారి కనకదుర్గమ్మ తిన్నాలకు పోయుండ్య పొగబండ్లతోనే పైన మోడాలు ఆడ్తాండయంట ఊరూరికీ పొగబండ్లలోనే జనాలంతా […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘గండికోట’కు పురస్కారం

కడప.ఇన్ఫో మరియు తెలుగు సమాజం మైదుకూరులు సంయుక్తంగా ప్రచురించిన ‘గండికోట’ పుస్తకానికి గాను పర్యాటక శాఖ అందించే ‘ఉత్తమ పర్యాటక రచన’ పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పుస్తక రచయిత, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు సాహిత్యం

మైదుకూరులో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం!

కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికిపూర్తి వివరాలు ...

వార్తలు

మౌనఘోష’ పద్మావతమ్మ ఇక లేరు.!

రాయలసీమ తొలితరం వచన కవయిత్రి , ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు పసుపులేటి పద్మావతమ్మ (76) గురువారం కన్నుమూశారు. ‘మౌనఘోష’ కవితా సంపుటి ద్వారా కవయిత్రిగా పేరుపొందారు. చేరా, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు మౌనఘోష గురించి ప్రత్యేకంగా రాశారు. రాధా మహిళా సమాజాన్ని స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రొద్దుటూరు, కడప పట్టణాల్లో వృద్ధాశ్రమాలను నిర్వహించారు. హాస్పటల్‌ ద్వారా రోగులకు సేవలను అందించడమే కాక అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. కడపజిల్లా రెడ్‌ క్రాస్‌ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పాత కలెక్టరేట్ వయసు 132 ఏళ్ళు

కడప నడిబొడ్డున ఉన్న కలెక్టరేట్ పాత భవనాన్ని 1889 సంవత్సరంలో బ్రిటీషువారు నిర్మించారు. అంటే ఈ భవనం వయసు : 132 ఏళ్ళు భవన నిర్మాణ వ్యయం అప్పట్లో కేవలం 2 లక్షల 50 వేల రూపాయలు మాత్రమే. బ్రిటీష్ రాజరిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. స్వాతంత్య్రం రాక ముందు 65 మంది కలెక్టర్లు, స్వాతంత్య్రం వచ్చిన తరువాత  44 మంది కలెక్టర్లు ఈ భవనం నుంచి తమ […]పూర్తి వివరాలు ...

కళాకారులు

కొండపేట కమాల్ – రంగస్థల నటుడు

కొండపేట కమాల్ “నేను మా ఇంట్లో పెద్ద ఆద్దాలను అమర్చుకుని స్త్రీపాత్రల హావభావాలను, వివిధ రసాభినయాలాలో ముఖకవలికలను, ముస్తాబు తెరగులను, నవ్వులను, చూపులను, నడకలను కొన్నేళ్ళపాటు సాధన చేశాను. ఈ కమాల్ ఈ సౌకర్యాలను సమకూర్చుకునే ఆర్ధిక స్తోమత లేని వాడయినప్పటికీ హావభావ ప్రదర్శనలో నన్ను ముగ్ధుణ్ణి గావించాడు. ఈయన గానమాధుర్యం అసమానమైనది. ఈయన నిజంగా వరనటుడు.. ఈయనను గౌరవించుటకెంతో సంతోషిస్తున్నాను’’ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల […]పూర్తి వివరాలు ...

పర్యాటకం ప్రత్యేక వార్తలు వ్యాసాలు

మైదుకూరు సదానందమఠం

మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్‌ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు. […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు పర్యాటకం పల్లెలు

నంద్యాలంపేట

నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463. నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన […]పూర్తి వివరాలు ...

error: