కాంగ్రెస్ పార్టీ నుంచి మరోమారు పోటీ చేయాల్సివస్తే కూకట్‌పల్లి నుంచే పోటీ చేస్తానని, మైదుకూరులో పోటీ చేసే ప్రసక్తేలేదని డిఎల్ తన అనుచరులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇకపై హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు నిర్వహిస్తానని వివరించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం పరస్పర సహకారంతో పయనించాం. రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇప్పటి రాజకీయాల్లో కొనసాగలేను. మీ సహకారానికి కృతజ్ఞతలు. రాజకీయంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ మంగళవారం మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతో పేర్కొన్నట్లు సమాచారం. ఖాజీపేటలో ఈనెల […]పూర్తి వివరాలు ...
Search Results for: ఎన్ రామచంద్ర
కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...
‘అనంతపురంతో పాటు వైఎస్సార్‌జిల్లాలో ఇనుపఖనిజం ఉంది. బ్రహ్మణి అంటారో.. కడప అంటారో… రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ అంటారో…ఏపేరైనా పెట్టుకోండి.. ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే! అవకతవకలు జరిగాయని ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది..పరిశ్రమ ఏర్పాటుపై ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ‘ అని సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని పూర్తిచేయాలనే డిమాండ్‌తో పరిశ్రమ ఏర్పాటు […]పూర్తి వివరాలు ...
‘సీతాదేవి ఎలా వుంటుంది?.. ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవిలా వుంటుందా…!’ ‘ ఏమో..! అలాగే వుంటుందేమో…!’ 1963 నాటి ‘లవకుశ’ సినిమాను చూసిన వారెవరైనా పై ప్రశ్నకు సమాధానం ఇలాగే చెబుతారు. ఎందుకంటే అందులో అంజలీదేవి ధరించిన సీత పాత్ర ఆమెకు అంత పేరును తెచ్చి పెట్టింది. పెద్దాపురంకు చెందిన అంజనీ కుమారి నటన, నృత్యం వంటి పలు అంశాలలో తనదైన ముద్రను వేసుకున్నారు. చిన్నప్పటి నుండి నాటకాలతో సహజీవనం సాగించిన అంజనీకుమారి అనుకోకుండా సినీ రంగంలోకి ప్రవేశించారు. […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు చుక్క తాగు, సాగునీరు అందక ఈ ప్రాంతం శాశ్వత కరువు బారిన పడుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఛైర్మన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం కడప ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన గర్జన కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఏజేసీ ప్రసంగించారు. రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా […]పూర్తి వివరాలు ...
ఎద్దుల ఈశ్వరరెడ్డి (1986 ఆగస్టు 3) అంతిమ శ్వాస విడిచి, 27 సం||లు అయ్యింది. 27వ వర్థంతి సందర్బంగా ఆయన గురించిన స్మృతులను నెమరు వేసుకోవడం, నేటి పరిస్థితులను మదింపు చేసుకోవడం అత్యంత అవసరం. ఈశ్వరరెడ్డిగారు నిజంగా కీర్తిశేషులే. ”గాడ్ ఈజ్ క్రియేటెడ్ బై మాన్” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. […]పూర్తి వివరాలు ...
‘థాకరే బతకడం కోసం రాశాడు, డికెన్స్ రాయాలి కాబట్టి రాశాడు’ అన్నాడు జార్జి శాంప్సన్. సొదుం జయరాం కూడా అంతే. ‘పుణ్యకాలం మించిపోయింది’ అన్న కథలో నాయకుడు గోపాలకృష్ణ కథా రచయితే. అతడి గురించి రాసిన మాటలు జయరాంకూ వర్తిస్తాయి. దీపావళి కథల పోటీకి రాయమని గోపాలకృష్ణ భార్య పోరు పెడుతుంది. బహుమతి మొత్తం ఆశ పుట్టించడంతో ఆమె భర్తను ప్రేరేపిస్తుంది. కానీ గోపాలకృష్ణ ‘డబ్బు కోసమని ఏనాడూ కథలు రాయలేదు. రాయాలని అనిపించినపుడు రాశాడు. సామాజిక […]పూర్తి వివరాలు ...
టంగుటూరి ప్రకాశం పంతు లుగారిని స్ఫూర్తిగా తీసు కొని దేశం కోసం ఏ త్యాగం చేయ డానికైన సిద్ధపడిన వీరవనిత కడప రామ సుబ్బమ్మ. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకాలోని సుద్దపల్లె వీరి జన్మస్థలం. 1902లో కొనుదుల రామచంద్రారెడ్డి, అచ్చమాంబల కుమార్తెగా జన్మిం చారు.ఆమె 15వ ఏట, 19 17లో కడప కోటిరెడ్డితో వివాహం అయింది. ఆయన లండన్ యూని వర్సిటీలో ఎల్.ఎల్.బి.,ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీలొ బి.సి.ఎల్. పట్టాలు పోంది బార్‌ఎట్‌లా అయినారు. విదేశాలకు వెళ్లి చదివివచ్చిన ఆనాటి […]పూర్తి వివరాలు ...
అప్పుదెచ్చి కవులకిచ్చును, తప్పక ఋణదాతకిచ్చు తానేమగునో – ఉప్పలపాటి వెంకట నరసయ్య భావకవితోద్యమ స్రవంతి వొరిగి పొరిలేవేళ రాయలసీమలో ”తొలకరి చినుకులు” కురిపించి, సెలయేరై విజృంభించి సంగమింప చేసిన అభ్యుదయ కవితావేశ మూర్తి వైసివిరెడ్డి. వైసివి రెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి – కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు. తండ్రి కొండారెడ్డి పెద్దరైతు. పిల్లలను వేకువనేలేపి అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం వల్లెవేయించి భారత, భాగవతాల్లోని పద్యాలు వినిపించేవారు. గ్రామంలో […]పూర్తి వివరాలు ...