Search Results for: తవ్వా ఓబుల్ రెడ్డి

    చరిత్ర పర్యాటకం పల్లెలు

    ముత్తులూరుపాడు

    ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి  […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    రైతు నేత డిఎన్ నారాయణ ఇక లేరు

    కృష్ణాపురంలో అంత్యక్రియలు మైదుకూరు: రాయలసీమ రైతాంగ మౌలిక సమస్య లపై తనదైన రీతిలో పోరాటం సాగించిన మైదుకూరు రైతుసేవా సంఘం అధ్యక్షుడు డి.యన్.నారాయణ(63) శనివారం ఉదయం మైదుకూరులో మరణించా రు. నారాయణకు రెండేళ్ల కిందట గుండె శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల కిందట అస్త్వస్థతకు గురి కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించింది. నారాయణ అపస్మారక స్ధితిలోకి వెళ్ళిపోవడంతో  ఇంటికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఆధునిక సాంకేతికతే పిచ్చుకలకు శాపం

    మారుతున్న ప్రజల జీవన విధానాలే మనుషుల్లో ఒకటిగా బతుకుతున్న పిచ్చుకలు కనుమరుగయ్యేలా చేస్తున్నాయని, జీవ వైవిధ్యానికీ , పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ రచయిత, పప్పన్నపల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవ్వా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా, మైదుకూరు మండల పరిధిలోని పప్పన్నపల్లె గ్రామ పంచాయతీలోని పప్పన పల్లె గ్రామంలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (H.W), అమ్మ సేవా సమితి ప్రపంచ పిచ్చుకల […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు వార్తలు

    గండికోట ను సందర్శించిన సి.ఎం. చంద్రబాబు

    రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కడప జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశమైన గండికోట లో పర్యటించి ఇక్కడి చారిత్రక విశేషాలను తిలకించారు. ఇక్కడికి సమీపంలోని గండికోట నీటిపారుదల ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు సోమవారమే జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి గండికోటలోని హరిత టూరిజం హోటల్ లో బస చేసారు. మంగళవారం ఉదయమే కోట ను సందర్శించారు. కోటలోని దేవాలయాలను , జుమ్మ మస్జిద్ , ధాన్యాగారం , పెన్నానది గండిని ఆయన […]పూర్తి వివరాలు ...

    కవితలు

    దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

    పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం పరమ తప్పవుతుందేమో కాని ..! కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో ఉండేలులై విరుచుకపడటం తప్పే కాదు ఉరి కొయ్యలూ ..కారాగారాలూ ఈ సీమ పుత్రులకు కొత్త కాదు తిరుగుబాటు చేయడం ..ప్రశ్నించడం ఇక్కడి వీరపుత్రులకు ..బ్రహ్మ విద్య కాదు ఈభూమి చరిత్ర పుటల్ని తిరగేసి చూడు మడమ తిప్పనితనం ఇక్కడి రక్తంలో నిక్షిప్తం ఉయ్యాలవాడ ఉగ్గుపాలతో నేర్పిన నైజం హంపన్న అహం హుంకరించిన చారిత్రక నిజం పప్పూరి ..కల్లూరి..గాడిచర్ల ఈ సీమ […]పూర్తి వివరాలు ...

    పర్యాటకం

    ఒంటిమిట్ట కోదండరామాలయం

    రాష్ర్టవిభజన నేపథ్యంలో భద్రాచల రామాలయం తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీరామనవమి వేడుకలను అధికార లాంఛనాలతో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ ఆలయ విశేషాల పట్ల తెలుగువారిలో సహజంగానే ఆసక్తి నెలకొంది. ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎన్నో విశిష్టతలను సంతరించుకున్న ఈ రామాలయం వివరాలు… కడప నుంచి తిరుపతికి వెళ్లే ప్రధానమార్గంలో కడపకు 24 కి.మీ. దూరంలో మండలకేంద్రం ఉంది. ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని స్థలపురాణం వివరిస్తోంది. […]పూర్తి వివరాలు ...

    కవితలు రాయలసీమ

    కల్లబొల్లి రాతల రక్తచరిత్ర

    గంజి కరువు దిబ్బ కరువు ధాతు కరువు డొక్కల కరువు నందన కరువు బుడత కరువు ఎరగాలి కరువు పెద్దగాలి కరువు పీతిరి గద్దల కరువు దొర్లు కరువు కరువులకు లేదిక్కడ కరువు ఎండిపోయిన చెట్లు బండబారిన నేలలు కొండలు బోడులైన దృశ్యాలు గుండెలు పగిలిన బతుకులు ఇదే అనాదిగా కనిపిస్తున్న రాయలసీమ ముఖ చిత్రం దగాపడిన దౌర్భాగ్యులకు ఈ నేల నెలవైంది వంచించబడి వధ్యశిల నెక్కడం ఇక్కడ మామూలైపోయింది ఈ అధవసీమ ముఖంపై ఎవడో ఎక్కడివాడో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ

    కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్‌బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా […]పూర్తి వివరాలు ...

    చరిత్ర పర్యాటకం పల్లెలు

    చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

    కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన  చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక  వైభవానికి  తార్కాణంగా నిలుస్తున్నాయి. చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి […]పూర్తి వివరాలు ...