కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. దీంతో కడప విమానాశ్రయం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర […]పూర్తి వివరాలు ...
Search Results for: కడప విమానాశ్రయం
[tie_list type=”checklist”] ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాదులో ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.15 గంటలకు విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి 11.30 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారు. 11.30 నుంచి 2.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు […]పూర్తి వివరాలు ...
జూన్ 7న తొలి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1234 కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల 40 నిముషాలకు బెంగుళూరు నుండి బయలుదేరి […]పూర్తి వివరాలు ...
కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో వైకాపాకి ఆదరణ ఎక్కువ ఉందని చెప్పి ముఖ్యమంత్రి కడప జిల్లాకు పూర్తి అన్యాయం చేస్తున్నారని వైకాపా జిల్లా కన్వీనర్ అమరనాథరెడ్డి, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష, నగర మేయర్ సురేష్‌బాబులు ధ్వజమెత్తారు. వైకాపా జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… కడప విమానాశ్రయం పూర్తయి సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంత వరకు ప్రారంభించకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కావొస్తున్నా జిల్లాకు ఒక్కపైసా నిధులు మంజూరు చేయలేదన్నారు. వస్తాయని భావిస్తున్న బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీని, […]పూర్తి వివరాలు ...
కడప: హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు శాసనమండలి ఉప సభాపతి సతీష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడపలో హైకోర్టు ఏర్పాటుకు నూతన కలెక్టరేట్ భవన సముదాయం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వసతులు ఉన్నాయన్నారు. హైకోర్టును కడపలో ఏర్పాటు చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల కక్షిదారులకు కడప కేంద్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులు న్యాయవాదులకు మంజూరు […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రకటించి చివర్లో ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు మీడియాకు లీకులిచ్చారు. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా అధికారులు ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు. ఎయిర్‌పోర్టులో రన్‌వే 8 సీటర్ విమానం దిగేందుకు అవసరమైన స్థాయిలోనే నిర్మించారని అందువల్లే విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడిందని ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే మంత్రి కిశోర్ బాబు మరో మూడు నెలలలో […]పూర్తి వివరాలు ...
కడప విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా పడింది. ఈ నెల 14న ప్రారంభమవుతుందని ప్రచారం జరగడం, అధికార పార్టీ నేతలు కూడా పోటీపడి ఆ మేరకు ప్రకటనలు చేయడం, మీడియాలో కూడా ఈ వార్తలు ఊపందుకోవడంతో ఈ సారి తప్పక ప్రారంభమవుతుందని అంతా ఆశించారు. ఈ మేరకు విమానాశ్రయంలో సన్నాహాలు కూడా చేశారు. ప్రారంభ ఏర్పాట్లకు సంబంధించి రెండు మూడు రోజులుగా రెండు మూడు లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఖర్చు చేశారు. తీరా శుక్రవారం విమానాశ్రయ […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతున్నాడని రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన రాయచోటిలోని వైకాపా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించి కోస్తా- ఆంధ్రలో ఏర్పాటు చేయడం దారుణమన్నారు. కడప జిల్లాకు రావాల్సిన డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు కేటాయించుకోవడం అన్యాయమన్నారు. దీనిపై తెదేపా జిల్లా నేతలు కూడా నోరు మొదపలేదన్నారు. కడపలో విమానాశ్రయం పూర్తయినా ఇంత వరకు ప్రారంభించలేదన్నారు. […]పూర్తి వివరాలు ...