ఆకాశవాణి కడప ప్రసారాలు ప్రారంభం

ఆకాశవాణి కడప కేంద్రం రాయలసీమ ప్రాంత ప్రజల సాంస్కృతిక వాణిగా 1963 జూన్ 17న రిలే కేంద్రంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి ఈ రిలే కేంద్రం ప్రారంభించారు. కొప్పర్తిలో రిలే స్టేషన్ నిర్మించి సాయంప్రసారాలు హైదరాబాదునుండి 20 కిలోవాట్ల ప్రసార శక్తితో ప్రారంభమయ్యాయి. 1975 జూన్ లో స్వతంత్ర కేంద్రంగా ప్రసారాలు ప్రారంభమయిన సభకు రాష్ట్రమంత్రి యం. లక్ష్మీదేవి ముఖ్య అరిథి. బెంగుళూరుకు చెందిన టి. ఆర్. రెడ్డి తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు. తర్వాత డైరక్టరుగా మంగుళూరు బదలీ అయ్యారు. వీరు బెంగుళూరు కేంద్రం డైరక్టరుగా 1986 జూన్ లో రిటైరయ్యారు. బెంగుళురులో స్థిరపడ్డారు.

1974 నవంబరు 2 నుండి మూడు ప్రసారాలు కడప కేంద్రం నుండి ప్రారంభమై నిలయకళాకారులు, కార్యక్రమ నిర్వాహకులు చేరారు. కార్యక్రమ రూపశిల్పులలో శ్రీ బి. ఆర్. పంతులు, ఆర్. విశ్వనాథం, కె. రాజభూషణరావు, శ్రీ గోపాల్, డా. ఆర్. అనంతపద్మనాభరావు, గొల్లపూడి మారుతీరావు, ఆరవీటి శ్రీనివాసులు, దేవళ్ళ బాలకృష్ణ, డి. కె. మురార్, శ్రీ పి. ఆర్. రెడ్డి, వై. గంగిరెడ్డి, డా. టి. మాచిరెడ్డి, సుమన్, కౌతా ప్రియంవద వంటి వారు ప్రముఖులు. ఈ కేంద్రం రాయలసీమ వాసుల చిరకాల వాంఛలకు ప్రతీకగా ఎందరో కళాకారులను తీర్చిదిద్దింది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *