Search Results for: సన్నపురెడ్డి

    కథలు

    చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

    కవితలు

    నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    సన్నపురెడ్డి నవల ‘కొండపొలం’కు తానా బహుమతి

    కడప : జిల్లాకు చెందిన ప్రసిధ్ద రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ‘తానా నవలల పోటీ – 2019’ బహుమతికి ఎంపికైంది. అమెరికా నుంచి, భారత్‌ నుంచి పోటీకి మొత్తం 58 నవలలు వచ్చాయి. వాటన్నిటిలో సన్నపురెడ్డి నవల ఉత్తమంగా నిలిచి రెండు లక్షల రూపాయిల ‘తానా’ బహుమతి గెలుచుకుంది. తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని అందుకుంటున్న తొలి రచనగానూ ఇది నిలిచిపోనుంది. అవార్డుకు అర్హమైన నవలల ఎంపికలో, ప్రముఖ […]పూర్తి వివరాలు ...

    కథలు

    ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్‌ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్‌ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి […]పూర్తి వివరాలు ...

    కవితలు

    ఒక్క వాన చాలు (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    వాన మాట విన్పిస్తే చాలు చెవులు – అలుగుల్ని సవరించుకొనే చెరువులవుతున్నాయి మేఘాల నీడలు కదిలితే చాలు కళ్లు – పురివిప్పే నెమళ్ళవుతున్నాయి కార్తె కార్తె ఓ కన్నీటి బిందువై పైరు చెక్కిళ్లమీద జాలిగా జారుతోంది ఉత్తర ప్రగల్భాల ఉరుముల్తో ఉత్తర కూడ దాటింది ఒక్క వాన వొంగితే చాలు ముక్కాలు పంటన్నా చేతికొస్తుంది ఎన్ని సాయంత్రాలు రేడియోల ముందు సాగిలబడ్డామనీ ! ఎన్ని సార్లు – జలరేఖల్ని లెక్కగట్టే ముసలాళ్ళ ముందు బీడీ ముక్కలమై మినుకు […]పూర్తి వివరాలు ...

    కథలు

    పాలకంకుల శోకం (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    పాలకంకుల శోకం కథ ఎదురుగా బడి కన్పించగానే గుర్తొచ్చింది కృష్ణకు – తను ఇంటివద్దనుంచి బయల్దేరేటపుడు ఈ దారిన రాకూడదనుకొంటూనే పరధ్యానంగా వచ్చాడని. సందులో దూరి పోదామనుకొన్నాడు గాని లోపల్నించి రమణసార్ చూడనే చూశాడు. “ఏమయ్యా క్రిష్ణారెడ్డి?” అంటూ అబయటకొచ్చాడు. “ఏముంది సార్..” నెత్తి గీరుకొంటూ దగ్గరగా వెళ్లాడు కృష్ణ. “బంగారంటి పాప. ఆ పిల్ల జీవితమెందుకు నాశినం జేస్తావ్? బడికి పంపీయ్యా. పదిరోజులైంది సూడూ” నిలదీశాడు రమణ. ఓసారి అటు ఇటు జూసి “సార్ సార్” […]పూర్తి వివరాలు ...

    Home

    అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో ఒకరు ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు మరియు వర్తకుడు అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి​ ముఖ్యమంత్రి​ కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    ‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

    మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితుల‌ను పోల్చి చేసుకునేందుకు ఒక కొల‌మానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్‌ రాసిన కథలు)  […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

    కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...