మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్ రాసిన కథలు) […]పూర్తి వివరాలు ...
Search Results for: రమణారెడ్డి
రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి […]పూర్తి వివరాలు ...
ఎం.వి.రమణారెడ్డి గారు రాసి ప్రచురించిన ‘రాయలసీమ కన్నీటి గాథ’ ఈ-పుస్తకం. రాయలసీమ ఏ విధంగా వంచనకు గురయిందో తెలిపిన మొట్ట మొదటి పుస్తకం. రాయలనాటి వైభవంతో రతనాలసీమగా ఖ్యాతినొందిన రాయలసీమ జిల్లాలు నేడు కటిక దారిద్ర్యానికి శాశ్వత చిరునామాగా మారిపోయాయి. ఒకప్పటి అన్నదాత, నేడు గుక్కెడు నీటికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అంగళ్లలో రతనాలమ్మిన ఆ వైభవం రాయలతో పాటే గతించింది. ఆలనలేని నీటిపారుదల వసతులు, పాలనలేని రాయలసీమ ప్రజలు క్రమక్రమంగా శిథిలమౌతూ వచ్చారు.పూర్తి వివరాలు ...
ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు చనిపోయేనాటికి నా వయసు ఎనిమిదేండ్లు.పూర్తి వివరాలు ...
సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ మోహన్ లు. అభ్యుదయ సాహితీ చరిత్రలో తమదైన చెరగని ముద్ర వేశారు ఈసోదరత్రయం . వీరిలో జయరాం, రామమోహన్ బయటి ప్రపంచంలో తిరిగినవారు. […]పూర్తి వివరాలు ...
అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో ఒకరు ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు మరియు వర్తకుడు అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (జీవో ఆర్.టీ. నెంబరు 179, విద్యాశాఖ) విడుదల చేసింది. జమ్మలమడుగుకు చెందిన జంబాపురం వెంకటరమణారెడ్డి చైర్మన్ గా, కోడూరు వాసి కొండూరురాజు ప్రతాపరాజు, ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రహ్మణ్యం, కడప చెందిన షామీర్ బాష, మైదుకూరుకు చెందిన అందే పాపయ్య గారి రవీంద్ర, గొడిగనూరుకు చెందిన బైసాని ప్రతాప్ రెడ్డి, కమలాపురంకు చెందిన సులేఖ సభ్యులుగా నియమితులయ్యారు.పూర్తి వివరాలు ...