కడప: స్థానిక సీపీ బ్రౌన్ బాషా పరిశోధన కేంద్రం వేదికగా ఆదివారం మల్లెమాల సాహిత్య పురస్కార ప్రధానోత్సవం, పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. సాహితీ రంగంలో చేసిన సేవకు గుర్తింపుగా ఆచార్య మధురాంతకం నరేంద్ర మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమంలో సామాజిక ప్రయోజనంగా మధురాంతకం నరేంద్ర సాహిత్యం ఉంటుందని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ… మనుషు ల వ్యక్తిత్వంలో ఉన్న తేడాను […]పూర్తి వివరాలు ...
Search Results for: మల్లెమాల
అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో ఒకరు ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు మరియు వర్తకుడు అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, […]పూర్తి వివరాలు ...
మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
తులసీకృష్ణ, తులసి, పి రామకృష్ణ పేర్లతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించిన కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత రామకృష్ణారెడ్డి పోసా గారి రచనలను అన్నిటినీ ఏర్చీ కూర్చీ వారి కుమారుడు సురేంద్ర (ప్రఖ్యాత కార్టూనిస్టు) ఒకే పుస్తకంగా తీసుకు వస్తున్నారు. ‘పి రామకృష్ణ రచనలు’ పేర వెలువడిన రెడ్డి గారి సాహితీ సర్వస్వం ఆవిష్కరణకు సిద్ధమైంది. 820 పుటలున్న ఈ పుస్తకంలో రామకృష్ణ గారి కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు (కాలమ్స్ సహా) అన్నీ ఉన్నాయి. అన్వర్ గీసిన […]పూర్తి వివరాలు ...
కడప: ప్రజాస్వామ్య దేశంలో రచనలు లౌకికవాద ధృక్పథంతో సాగితే అది అభ్యుదయంగా చెప్పవచ్చని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. ఎర్రముక్కపల్లెలోని స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధన కేంద్రంలో ‘ప్రగతిశీల సాహిత్యోద్యమం- కడప జిల్లా వారసత్వం’ అనే అంశంపై సీపీఐ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన చర్చా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… కడప జిల్లా వారసత్వం అనే అంశంపై చెప్పుకోవాల్సినపుడు 1968లో ప్రారంభమైన ‘సంవేదన’ గుర్తు చేసుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...
సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో అభినందన సభను జరిపింది. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు శ్రీమతి పి సంజీవమ్మ మాట్లాడుతూ రాచపాలెం సాహితీ […]పూర్తి వివరాలు ...
ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాలో పుట్టి తెలుగుజాతికి వేగుచుక్కలుగా వెలుగొందిన అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మంలు సమాజిక రుగ్మతలపై ఆనాడే తమ కలాలను ఝులిపించి, గలమెత్తారని, వీరిలో వేమన తన ధిక్కారస్వరాని బలంగా వినిపించారని ఆదివారం కడపలో జర్గిన “వేగుచుక్కలు” పుస్తక పరిచయ సభలో వక్తలు కొనియాడారు. యోగివేమ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకురాలు రచయిత్రి ఎంఎం వినోదిని రచించిన వేగు చుక్కలు పుస్తకావిష్కరణ సభ జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వేదికగా జరిగింది. […]పూర్తి వివరాలు ...