ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...
Search Results for: పుట్టపర్తి
ప్రొద్దుటూరు: పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 25వ వర్థంతి సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక శివాలయం కూడలిలోని ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పుట్టపర్తి సాహితీపీఠం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంఈఓ శివప్రసాద్ మాట్లాడుతూ పుట్టపర్తి భావితరాలకు మార్గదర్శి, ఆదర్శప్రాయుడని కొనియాడారు. పుట్టపర్తి వారు కొంతకాలం పాటు ప్రొద్దుటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇక్కడి వాళ్ళ అదృష్టమన్నారు. వీరపునాయునిపల్లె మండల అభివృద్ది అధికారి మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ… […]పూర్తి వివరాలు ...
ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి సంవత్సరం… ఆ మహానుభావుడి సాహిత్య కృషీ.., శివతాండవ సృష్టీ.. మన సిరిపురి పొద్దుటూరులోనే జరిగింది. భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మ పురస్కారాలనూ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లను పుట్టపర్తి వారు అందుకున్నారు. పుట్టపర్తితో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠమిది… ఈ ఇంటర్వ్యూ చేసిన సంవత్సరం అందుబాటులో లేదు. […]పూర్తి వివరాలు ...
‘ఏమానందము భూమీతలమున శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో.. ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. 20 సంవత్సరాల కిందట ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసరచయిత ఇట్లా రాశాడు. ‘‘పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ధృవతార సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయన బహు భాషా కోవిదుడు. రాయలసీమ గర్వించదగ్గ భారతీయ సాహిత్యకారుడు. సాహితీసేద్యంలో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ మహానుభావుని కుమార్తె నాగపద్మిని. నాన్నగారి (అయ్యగారు) జ్ఞాపకాలను ఆమె ఇలా పంచుకున్నారు …పూర్తి వివరాలు ...
రారా.. ఒక ఉత్తేజం తాడి ప్రకాష్ “ రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే ” అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్‌ల అవ్యాజప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైనవాడు రారా. రారా విమర్శ, రారా వ్యక్తిత్వం, రారా వచనం… […]పూర్తి వివరాలు ...
అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో ఒకరు ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు మరియు వర్తకుడు అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, […]పూర్తి వివరాలు ...
గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక స్థలకావ్యాలని కూడా పిలువవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్రప్రశస్తి కావ్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భక్తి ప్రధానంగా రచింపబడ్డాయి. కానీ ఆధునిక కాలంలో వచ్చిన క్షేత్రప్రశస్తి కావ్యాల లక్ష్యం వేరు. స్వాతంత్య్రోద్యమ కాలం కావడం వల్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆధునిక కవుల లక్ష్యం. అందువల్లనే ‘ఓ ఆంధ్రుడా! […]పూర్తి వివరాలు ...