‘గండికోట’కు చేరుతున్న కృష్ణమ్మపూర్తి వివరాలు ...
Search Results for: గండి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ” వారసత్వ కట్టడాల దత్త స్వీకారం’ పథకం కింద కడప జిల్లాలోని ప్రఖ్యాత చారిత్రిక కట్టడమైన గండికోటను దాల్మియా సంస్థ దత్తతకు తీసుకుంది. గండికోట తో పాటు దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన దిల్లీ లోని ఎర్రకోట ను కూడా దాల్మియా సంస్థ దత్తత తీసుకుంది. ఈ నిర్ణయం పై పలు రాజకీయ పక్షాలు , చరిత్ర కారులలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈమేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాల్మియా […]పూర్తి వివరాలు ...
గండికోట కావ్యం సమీక్ష తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక స్థలకావ్యాలని కూడా పిలువవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్రప్రశస్తి కావ్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భక్తి ప్రధానంగా రచింపబడ్డాయి. కానీ ఆధునిక కాలంలో వచ్చిన క్షేత్రప్రశస్తి కావ్యాల లక్ష్యం వేరు. స్వాతంత్య్రోద్యమ కాలం కావడం వల్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆధునిక కవుల లక్ష్యం. అందువల్లనే ‘ఓ ఆంధ్రుడా! […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం కడప జిల్లాలోని చారిత్రక పర్యాటక ప్రదేశమైన గండికోట లో పర్యటించి ఇక్కడి చారిత్రక విశేషాలను తిలకించారు. ఇక్కడికి సమీపంలోని గండికోట నీటిపారుదల ప్రాజెక్ట్ ను సందర్శించేందుకు సోమవారమే జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి గండికోటలోని హరిత టూరిజం హోటల్ లో బస చేసారు. మంగళవారం ఉదయమే కోట ను సందర్శించారు. కోటలోని దేవాలయాలను , జుమ్మ మస్జిద్ , ధాన్యాగారం , పెన్నానది గండిని ఆయన […]పూర్తి వివరాలు ...
తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. ఉత్తర్వులు జారీ చేశారు. మొదట్లో ఆలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ చూపిన తితిదే అధికారులు 2009 […]పూర్తి వివరాలు ...
ఫిబ్రవరి 27న ‘గండికోట’ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు కాలవ గట్ల మీద నిద్ర పోయైనా జులై నాటికి అక్కడ 35 టి.ఎం.సిల నీటిని నింపుతానని బహిరంగ సభలో వాక్రుచ్చారు (ఆధారం: https://kadapa.info/గండికోట-బాబు/). బాబు గారు చెప్పిన జులై పోయింది సెప్టెంబరు కూడా వచ్చింది. ‘గండికోట’కు నీళ్ళ జాడ లేదు. ముప్పై టిఎంసిలు కాదు మూడు టిఎంసిలు కూడా ‘గండికోట’కు రాలేదు. పెండింగ్ పనుల పూర్తికి డబ్బులు ఇవ్వకుండా కాలవ గట్లపైన నిద్రపోతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం పోతిరెడ్డిపాడు నుంచి ప్రాజెక్టుల పరిశీలన చేపట్టిన అఖిలపక్షం శుక్రవారం ఉదయం గోరుకల్లు నుంచి బయలుదేరి కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు వద్దకు చేరుకుంటుంది. కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యుడు శ్రీనివాసులు, బద్వేలు శాసనసభ్యుడు జయరాములు, కడప శాసనసభ్యుడు అంజాద్‌బాషా, శాసనమండలి సభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి, వైకాపా రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, ఆ […]పూర్తి వివరాలు ...
గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిన చిరుతపులి(లు) శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఎనిమిది గొర్రెలను చంపింది. చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకుముందు కూడా చిరుత ఇలాగే గొర్రెల మీద దాడి (జత చేసిన చిత్రం అప్పటిదే) చేసింది. దాంతో గత సెప్టెంబరు నెలలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒకటిన్న సంవత్సరం […]పూర్తి వివరాలు ...
కడప: త్వరలోనే జమ్మలమడుగు ప్రాంతంలో చిత్ర నిర్మాణం ప్రారంభించనున్నట్లు దర్శకుడు తేజ చెప్పారు. శనివారం నిర్మాత వివేకానందతో కలిసి తేజ గండికోటను సందర్శించి అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయం, జుమ్మామసీదు, ధాన్యాగారం, తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జమ్మలమడుగుటోని వందేళ్ల చరిత గల ప్రభుత్వ పీఆర్ పాఠశాల, ఆర్డీవో కార్యాలయం, ఎల్ఎంసీ స్కూలు ప్రాంతాలను పరిశీలించారు.పూర్తి వివరాలు ...