ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. పూర్వం ఈతచేట్లు, తాటిచెట్లు విరివిగాఉన్న ప్రాంతంలో ఉండిన ఈ గ్రామానికి ఈతలపల్లె పేరు ఉండేది. ప్రజలు రోగగ్రస్తులు కావడంవల్ల ఈతలపల్లె ఉన్న ప్రాంతానికి పడమర వూరు కట్టుకుని ఊరట పొందినందున అప్పటి నుండి ఉరుటూరు అనే పేరు కలిగినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. “ఉరు” అంటే గొప్ప , ప్రాశస్త్యం గలిగిన అనే అర్థాలున్నాయి. అందువల్ల ఉరు+ఊరు= ఉరుటిఊరు […]పూర్తి వివరాలు ...
Search Results for: ఉరుటూరు
ఊరూ వాడా సొదుం జయరాం కథ మా ఆవిడకు బ్రెయిన్ వాష్ చెయ్యడమన్నది నా వల్ల అయ్యే పనికాదు. ఆవిడ ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిందంటే దాన్నుంచి ఒక్క ఇంచ్ కదలించడం కూడా కష్టమే. కానీ ఓటమిని అంగీకరించడం నాకూ ఇష్టంలేదు. మా అమ్మాయి పెళ్లి విషయంలో మా ఇద్దరి మధ్యా పేచీ ప్రారంభమైంది. “మీరు నూరు చెప్పండి, పల్లెటూరికి అమ్మాయిని ఇవ్వడానికి ససేమిరా నేనొప్పుకోను” అంది ఖచ్చితంగా అరుణ. “పల్లెలంటే పూర్వంలాగానే వున్నాయనుకుంటున్నావేమో. అదేం కాదు. పల్లెలు […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ పాడె చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు. చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, […]పూర్తి వివరాలు ...
తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. “మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”. “అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి. “ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు. ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి […]పూర్తి వివరాలు ...
సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ. దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకొనేవాళ్లం. పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పాడుపని చేసి చచ్చింది.” అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచీ వెక్కి వెక్కి […]పూర్తి వివరాలు ...
సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు కలిగిన ఊరే కాదు. సాహితీ దిగ్గజాలైన సొదుం సోదరులు జన్మించిన గ్రామం. వారి పేర్లు సాహితీలోకానికి చిరపరిచితం . వారే సొదుం గోవింద రెడ్డి , సొదుం జయరాం, సొదుం రామ మోహన్ లు. అభ్యుదయ సాహితీ చరిత్రలో తమదైన చెరగని ముద్ర వేశారు ఈసోదరత్రయం . వీరిలో జయరాం, రామమోహన్ బయటి ప్రపంచంలో తిరిగినవారు. […]పూర్తి వివరాలు ...
‘‘వాళ్లు కాళ్లూ చేతులూ విరుస్తామంటే నువ్వు మగాడివి కాదూ? ఒంగోలు కోడెలావున్నావు. కోసేస్తే బండెడు కండలున్నాయి. ఆడదానికున్న పౌరుషం లేదేం నీకు?’’ అంది. ‘‘నేనేమో పరాయి ఊరువాణ్ని. పైగా గవర్నమెంటు ఉద్యోగిని’’ పూర్తి వివరాలు ...
ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...