అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు …
ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. కొద్దిసేపటికి ఇంట్లో నుండి హాలులోకి వచ్చి ఆత్మీయంగా పలకరించారు 76 సంవత్సరాల పద్మనాభంగారు.
ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన బసవరాజు పద్మనాభం తన జ్ఞాపకాల దొంతరలను మా ముందు ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే… Read the rest of this entry »
Popularity: 87% [?]
